Nandamuri taraka ratna new movie

nandamuri taraka ratna new movie

nandamuri taraka ratna new movie

22.gif

Posted: 08/20/2012 08:11 PM IST
Nandamuri taraka ratna new movie

      జయాపజయాలను పక్కన పెట్టి పట్టువదలని విక్రమార్కుడిలా తెలుగుతెరమీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు నందమూరి తారక రత్న. అటు రాజకీయరంగంలోనూ చెమటోడ్చి నిలదొక్కుకునేందుకు కూడా ప్రయత్నించాడీ సమర యోధుడు. ఇటీవలకాలంలో తానుtaraka_inn యాక్షన్ ... కామెడీ ... వగైరా ఏవైనా చేయగలనని నిరూపించుకోవడం కోసం తెగ ఆరాటపడి పోతున్నాడు. ఈ నేపథ్యంలో కథ ఏదైనా ... దర్శక నిర్మాతలు ఎవరైనా అతను సై అంటున్నాడు. ఇప్పుడిదే తరహాలో తాజాగా ఓ సినిమాని అంగీకరించాడు. ఆ సినిమా పేరే 'చూడాలని - చెప్పాలని'.  శ్రీ శివ శంకర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగమళ్ళ శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పార్గవన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ,ఇది తారకరత్నకి అన్ని విధాలా సరిపోయే కథ అని చెప్పారు. లవ్ ... సెంటిమెంట్ ... యాక్షన్ ... కామెడీని మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు. 'వరుడు' ఫేం భానుశ్రీ మెహ్రా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందనీ ... అదే షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తామని చెప్పారు. ఇదైనా తారక్ కు బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan nagarjuna movies war end
Veteran actress sita daughter turns director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles