Tollywood actor chandra mohan quit acting

tollywood actor chandra mohan quit acting ,

tollywood actor chandra mohan quit acting

4.gif

Posted: 09/04/2012 12:55 PM IST
Tollywood actor chandra mohan quit acting

      chandra_e ఇది నిజంగా తెలుగు చిత్ర ప్రియులకు బాధకలిగించే వార్తే.. ఎందుకంటే.. ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో అవలీలగా అభినయించి మెప్పించే నటుడు చంద్రమోహన్. మరి కొన్నాళ్లలో నట జీవితానికి స్వస్తి చెప్పనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. ఇంతవరకు 200 చిత్రాలలో నటించిన ఈ అరుదైన నటుడు మరో మూడేళ్ళలో నటనకు బై చెప్పి, విశ్రాంతి తీసుకోనున్నాడు. 'సినిమా రంగానికి వచ్చి 47 ఏళ్ళు అయింది. మరో మూడేళ్లు నటించి, 50 ఏళ్లు పూర్తవగానే ఇక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను' అంటున్నారాయన. విశేషం ఏమిటంటే, సినిమా పరిశ్రమలో ఎంతగా స్లంప్ వచ్చినా తనకు మాత్రం ఎప్పుడూ పని ఉంటుందని ఆయన అంటున్నాడు. ఇంతవరకు ఏ నెలలోనూ కూడా మేకప్ chandra_eeవేసుకోకుండా ఖాళీగా లేనని చంద్రమోహన్ అన్నారు. ప్రేక్షకుల్ని అలరించడమే ప్రధానంగా తన నట జీవితాన్ని కొనసాగించాననీ, హీరోగా వేసినా, చిన్న పాత్ర పోషించినా ప్రేక్షకుల్ని మెప్పించానని ఆయన చెప్పారు. చంద్రమోహన్ కనిపిస్తే చాలా ఆ చిత్రానికి ఓ బలం చేకూరినట్టే నని భావించే అలవాటు తెలుగు చిత్ర సీమలో ఉంది. అంతలా తనదైన ముద్రను తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్రించారు చంద్రమోహన్. ఒకవేళ చంద్రమోహన్ నటన నుంచి వైదొలిగితే తెలుగు తెర ఓ అద్భుతమైన నటుడిని మిస్ అయినట్టే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Live telugu movie
Ala aite telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles