శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న 'దేవరాయ' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 12 న హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో జరుగుతుంది. హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆడియోను ఆవిష్కరిస్తారని ఆ చిత్ర యూనిట్ కొద్దిసేపటిక్రితం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. మహేష్ తో దూకుడు నిర్మించిన ‘14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్’ ఈ సినిమాను నిర్మిస్తోంది. గతంలో ఈ చిత్రం కోసం చంద్రుడు, ఆగడు వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఐతే మహేష్ లెక్చరర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ‘ఆచార్య’ అయితే సరైన టైటిల్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ కెరీర్ లోనే పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా మహేష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది.
ఇక, యాక్షన్ కథా చిత్రాలను రూపొందించటంలో దర్శకుడు బోయపాటి శ్రీను పెట్టింది పేరు. అయితే, ఇప్పుడాయన తన శైలికి భిన్నంగా రాంచరణ్ తో ఓ మంచి లవ్ స్టొరీ తీయటానికి ప్లాన్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఇప్పుడు బోయపాటి లవ్ స్టొరీకి చరణ్ పచ్చ జండా ఊపుతాడో... లేదో ...వేచి చూడాల్సిందే!
తారకరత్న చూడబోతే, సాంఘికాల్లోనే కాదు పౌరాణిక పాత్రల్లోనూ తాను మెప్పించగలను అనే నిర్ణయానికి తారకరత్న వచ్చేసినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడాయన 'యమధర్మరాజు' గా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమౌతున్నాడు. ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో ఆయన యమధర్మరాజుగా నటిస్తున్నాడు. శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఫిల్మ్స్ బ్యానర్ పై నందన్ గౌడ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా వెంకట్ పంపన దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాలో రంభ ... ఊర్వశి ... మేనకలుగా క్రేజ్ ఉన్న కథానాయికలు కనిపిస్తారని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ను విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నట్టు చెప్పారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more