Chanakyudu audio teaser release

chanakyudu audio teaser release, taneesh

chanakyudu audio teaser release

5.gif

Posted: 09/05/2012 01:54 PM IST
Chanakyudu audio teaser release

       తనీష్, ఇషితాదత్తా, హీరో, హీరోయిన్లుగా చాణక్యుడు చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో, టీజర్ విడుదలైంది. నూతన సంగీత దర్శకులు రాహుల్-వెంగి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సాయిశ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై గొట్టింటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా విడుదలయ్యాయి. తిరివీధి సంతోష్, గొట్టింటి రామచంద్ర, నందన్‌రెడ్డి కొలన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి, తొలి సీడీని కళ్యాణ్‌కు అందజేశారు.
       ఈ క్రమంలో పాల్గొన్న ప్రముఖులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు.  సంగీత దర్శకులు రాహుల్-వెంగి మాట్లాడుతూ సంగీతంలో తమ ప్రస్థానం ఈ చిత్రంతో ప్రారంభమైందని, వచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని మంచి సంగీతం అందించే ప్రయత్నం చేస్తామని, తొలి ప్రయత్నమే విజయవంతం కావాలని కోరుకున్నారు. షూటింగ్ చాలా త్వరగా జరిగిందని, ఆడియోను, చిత్రాన్ని ఆదరించాలని దర్శకుడు ఫణిరాజ్ తెలిపారు. దర్శకుడు తాను చెప్పిన కథను చక్కగా తెరపైకి తీసుకువచ్చారని, నూతన సంగీత దర్శకులైన రాహుల్- వెంగిలకు మంచి భవిష్యత్ ఉండాలని నిర్మాత నందన్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్, నిఖిల్, సముద్ర, బాలయ్య, కె.వేణుగోపాల్, బెక్కం వేణుగోపాల్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.
       చంద్రమోహన్, రంగసాయి, బాలయ్య, జాకీ, సలీమ్‌పాండా, ప్రభాకర్, శ్రావణ్, భూపాల్, తాగుబోతు రమేష్, ప్రవీణ్, గౌతంరాజ్, భాష, గోవిందరాజ్, మధుమణి, వినీల, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: కందికొండ, వెంగళదాస్, చింతా శ్రీనివాస్, సంగీతం: రాహుల్-వెంగి, మాటలు: చింతా శ్రీనివాస్, కెమెరా: ఇ.ఎస్.హెచ్.ప్రసాద్, నిర్మాతలు: తిరివీధి సంతోష్, గొట్టింటి రామచంద్ర, నందన్‌రెడ్డి కొలన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గొట్టింటి శ్రీనివాస్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sorry teacher on youtube
Cine stars social message  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles