Ileana barfi movie success

Ileana Barfi Movie Success, Ileana Actress Ileana Barfi Barfi Movie

Ileana Barfi Movie Success

Ileana.gif

Posted: 09/26/2012 12:38 PM IST
Ileana barfi movie success

Ileana Barfi Movie Success

తొలి అడుగే చక్కగా బాలీవుడ్‌లో పడడంతో ఇలియానాకు పట్టపగ్గాలు లేవు. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం బర్ఫీ అద్భుత విజయాన్ని అందుకుంది. పనిలో పనిగా ఆస్కార్ పోటీకి కూడా వెళుతోంది. ఈ సంతోషాన్ని పంచుకుంటూ ఇలియానా ఇలా చెప్పుకొచ్చింది. బర్ఫీకోసం తాను మంచి మంచి అవకాశాలను వదులుకున్నానని, గ్లామర్ లేకపోయినా తన ఫిజిక్ చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని, తన కెరీర్‌లోనే ఓ గొప్ప విజయంగా బర్ఫీని చెప్పుకుంటానని తెలిపింది. కమర్షియల్‌గా ఈ కథ విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు తప్పక లభిస్తాయని తనకుముందే తెలుసని, అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంత విజయం అందించడం మాత్రం సరికొత్తగా ఉందని అంటోంది. తొలి చిత్రమే సక్సెస్ బాట పట్టడంతో ఇలియానాకు బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో ముగిసిందనుకున్న ఇలియానా చరిత్ర బాలీవుడ్‌లో మొదలవుతోంది. అంతే మరి! అదృష్టం వుంటే వారి అవకాశాలు ఎక్కడికీ పోవు అనే దానికి ఇదే ఉదాహరణ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai named un hivaids envoy
Remake of sudigadu by ram gopal varma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles