రవితేజకి మాస్ మహరాజా బిరుదు ఏమాత్రం అచ్చిరావటంలేదు. ఈ నేపధ్యంలో క్లాస్ మహరాజులా కనిపించేందుకు కాజల్ తో జతకట్టి “సారొచ్చారు” చిత్రంతో తయారయ్యాడు. డిసెంబర్ 21న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా పాటలు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మార్కెట్లోకి వచ్చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్స్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1. పాట : మేడ్ ఫర్ ఈచ్ అదర్
గాయకులు : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
హీరో హీరోయిన్ల పరిచయపాటగా సాగే ఈ గీతాన్ని దేవిశ్రీ పాడాడు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సరళంగా ఉంది.
2. పాట : జగ జగ జగదేకవీర
గాయకులు : వేణు,రనిన రెడ్డి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
స్లోబీట్ గా సాగే ఈ సాంగ్ సింథసైజర్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు దేవి తన సంగీతంతో. వేణు, రనిన రెడ్డి అందించిన గాత్రం హైలెట్. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు తగ్గట్టుగానే ఉంటుంది.
3. పాట : రచ్చ రంబోల
గాయకులు : జావేద్ అలీ, రీట
సాహిత్యం : శ్రీమణి
ఫాస్ట్ బీట్ మాస్ డ్యూయెట్ ఇది. జావేద్ అలీ - రీట గొంతు కిక్కెక్కించేదిగా ఉంది. శ్రీమణి అందించిన సాహిత్యం ఓకే. దేవిశ్రీ శైలి సంగీతం కనిపించింది. చిత్రీకరణ మీద ఈ పాట మనుగడ ఆధారపడి ఉంది.
4. పాట : గుస గుస
గాయకులు : సాగర్, సునీత
సాహిత్యం :అనంత శ్రీరామ్
రొమాంటిక్ మెలోడీ ఈ సాంగ్. సాగర్, సునీత గాత్రం పాటకు బలాన్నిచ్చింది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ సంగీతం బాగా ఊతమిస్తుంది.
5. పాట : కాటుక కళ్ళు
గాయకులు : ఖుషి మురళి, శ్వేతా మోహన్ ,చిన్న పొన్ను
సాహిత్యం :చంద్రబోస్
ఫుల్ మాస్ ట్రాక్ ఇది. శ్వేతా మోహన్, మురళి తన గాత్రంతో పాటను రక్తికట్టించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. ట్రెడిషనల్ ఇంస్ట్రుమెంట్స్ తో దేవిశ్రీ ప్రసాద్ పాటకు కొత్తదనాన్ని ఆపాదించారు.
బాటమ్ లైన్ :
రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న “సారోచ్చారు” ఆల్బమ్ లో రవితేజ చిత్రాల పరంపరలోనే రెండు మెలోడీలు ఒక మాస్ పాట రెండు పెప్పి ట్రాక్స్ ఉన్నాయి. దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. ‘గుస గుస’, ‘జగ జగ జగదేక వీర’ సాంగ్స్ హైలెట్ కావొచ్చు. దర్శకుడు పరశురామ్ చిత్రీకరణ మీద మిగతా పాటల భవిత ఆధారపడిఉంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more