Vikramprabu gajaraju movie success

gajaraju movie, vikramprabu, gajaraju movie success, gajaraju review,gajaraju movie news, gajaraju producer, gajaraju casting, gajaraju wallpapers, gajaraju teaser, prabhu, sivaji ganeshan

vikramprabu gajaraju movie success

3.gif

Posted: 12/22/2012 11:48 AM IST
Vikramprabu gajaraju movie success

gaja_in

        తొలి చిత్రంతోనే విక్రమ్ ప్రభు (శివాజీ గణేశన్ మనవడు, ప్రభు తనయుడు) తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగులో ‘గజరాజు’ గా రిలీజైన అతని సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది.  విక్రమ్ ప్రభు లక్ష్మీమీనన్ జంటగా ‘మైనా’ ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘కుమ్కి’ చిత్రానికి గజరాజు తెలుగురూపం. లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్టీ డైమన్షన్ ప్రై.లి. లింగుస్వామి సమర్పణలో బెల్లంకొండ సురేష్ ‘గజరాజు’ పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే.
      ఈ చిత్రం తెలుగింట విజయం సాధించటంపై  నిర్మాత బెల్లంకొండ సురేష్ యమ జోష్ మీదున్నారు. ‘బస్‌స్టాప్’ విజయంతర్వాత అనతికాలంలోనే ‘గజరాజు’ ద్వారా మరో సక్సెస్ ని సాధించారు బెల్లంకొండ. ఆంధ్రప్రదేశ్‌లో 200 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకొంది.
     ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలాకాలం తర్వాత ఓ అద్భుత ప్రేమకావ్యం వచ్చిందంటున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా మన్ననలు అందుకుంటోందీసినిమా..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles