Shriya pavitra movie press meet

actress shriya saran, shriya pavitra movie, pavitra movie audio release, prostitute in pavitra movie, pavitra movie audio function, suresh, actor saikumar

shriya pavitra movie press meet

నా కెరీర్‌లోనే ఉత్తమ పాత్ర 'పవిత్ర'

Posted: 04/13/2013 11:58 AM IST
Shriya pavitra movie press meet

పవిత్ర గా వెండితెరపైకి వస్తున్న  హీరోయిన్  శ్రియ పవిత్రంగా మాట్లాడుతుంది. శ్రియ కథానాయకిగా జనార్దన మహర్షి దర్శకత్వంలోరూపొందుతున్న 'పవిత్ర' ఆడియో సీడీలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆదేశ్ ఫిలిమ్స్ పతాకంపై వల్లూరి కె. సాదక్‌కుమార్, జి. మహేశ్వరరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్, రోజా, తనికెళ్ల భరణి, ఏవీయస్, కౌశిక్‌బాబు ప్రధాన పాత్రధారులు. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల విశాఖ సాగర తీరాన జరిగిన కార్యక్రమంలో నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆడియో సీడీల్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని శ్రియ స్వీకరించారు. శ్రియ మాట్లాడుతూ 'పవిత్ర'ను జనార్దన మహర్షి అద్భుతంగా మలిచారనీ, మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ పాత్రను చేశాననీ చెప్పారు.  "నా కెరీర్‌లో పవిత్ర బెస్ట్ కేరక్టర్ అవుతుంది. ఇందులోని డైలాగ్స్ అందర్నీ ఆలోచింపజేస్తాయి'' అని ఆమె అన్నారు. జనార్దన మహర్షి మాట్లాడుతూ "నాకు రచయితగా, దర్శకుడిగా చాలెంజింగ్ ఈ సినిమా. ప్రధాన పాత్రకి శ్రియ సరిగ్గా సరిపోయారు. శ్రీలేఖ అందించిన బాణీలు అందర్నీ అలరిస్తాయి'' అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.యన్. ఆదిత్య, నటులు కౌశిక్‌బాబు, సాయికుమార్, నటి మీనాకుమారి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles