అప్పుడెప్పుడో చిన్నప్పుడు ‘సిసింద్రీ ’ గా ప్రేక్షకులను అలరించిన అక్కినేని అఖిల్ వెండితెర పై హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన లో ఈయన ఎంట్రీ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అక్కినేని నాగార్జున ఈయన ఎంట్రీ పై ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చారు. నిన్న అక్కినేని సుశాంత్ నటించిన ‘అడ్డా ’ సినిమా ఆడియోకి వచ్చిన నాగ్ మాట్లాడుతూ... మొన్న గ్రీకువీరుడు ఆడియోకు వచ్చారు, నిన్న నాగచైతన్య ‘తడాఖా ’ ఆడియోకి వచ్చారు, నేడు సుశాంత్ ‘అడ్డా ’ అడియోకి వచ్చారు, రేపు అంటే వచ్చే సంవత్సరం ‘అక్కినేని ‘ అఖిల్ సినిమాఆడియో ఫంక్షన్ కి వస్తారంటూ అఖిల్ ఎంట్రీని ఇన్ డైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేశాడు నాగ్. దీంతో ‘శిల్పా కళా వేదిక ’ఈలలో అదిరిపోయింది. దీనిని బట్టి అఖిల్ సినిమా త్వరలో ఉంటుందని అర్థం చేసుచేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాల పైనే క్లారిటీ రావాల్సింది ఉంది. అఖిల్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను ఓ సీనియర్ దర్శకుడుతో రెడీ చేయిస్తున్నాడని టాక్. ఏమైతేనేం నాగ్ స్టేట్ మెంట్ లో ఆయన ఎంట్రీ పై సస్పెన్స్ వీడింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more