Yevadu audio release postponed to july 1

yevadu songs,Yevadu audio,Yevadu,Ram Charan Yevadu,Ram charan.

The audio release of Ram Charan-starrer Yevadu has now been scheduled for launch on July 1. The film's songs were earlier scheduled to be out on June 30 but the grand event had to be pushed back to July 1 due to security reasons

ఆడియో విడుదలకు వాయిదాకు కారణం ?

Posted: 06/28/2013 08:17 PM IST
Yevadu audio release postponed to july 1

మెగాస్టార్ రామ్ చరణ్ తేజ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన సినిమా ‘ఎవడు ’ ఏ ముహూర్తాన  మొదలు పెట్టారో కానీ దానికి అడ్డంకుల మీద అడ్డంకులు వస్తున్నాయి. ఈ సినిమా ఆడియోని జూన్ 30 వ తేదీన విడుదల చేయాలని అనుకొని అఫీషయల్ డేట్ ని కూడా ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే... ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడిందని, దీనిని జులై 1వ తారీఖుకు వాయిదా వేసినట్లు సినిమా వర్గాల సమాచారం. ఇలా సినిమాల విడుదల, ఆడియో తేదీలు అఫీషియల్ గా ప్రకటించి, ఇలా వాయిదాలు వేయడంతో అభిమానులు అయోమయంలో పడటమే కాకుండా, నిరాశ కూడా చెందుతున్నారు. అయితే ఈ అడియో విడుదల కార్యక్రమం వాయిదా పడటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. ఈ సినిమాకు గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఆ రోజు పవన్ రాలేక పోవడంతోనే ఈ సినిమా ఆడియోను వాయిదా వేశారని అంటున్నారు. మరి ఆరోజు అయినా ఈ ఆడియో విడుదల అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles