జర్నీ సినిమా ద్వారా తన వెండితెర ప్రయాణాన్ని మొదలు పెట్టిన అంజలి హాట్ ఫిగర్ గా పేరు తెచ్చుకుంది. ఆ మధ్య ఈమె మల్టీ స్టారర్ చిత్రం అయిన ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ’ లో నటించి హిట్ సాధించింది. ఆ తరువాత నుండి ఈ అమ్మడుకు అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమా విజయం తరువాత కాస్తంత రేటు పెంచిన అంజలి తాజాగా వచ్చిన బలుపు సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు ఆ సినిమా హిట్ కావడంతో ఈమె మరింత రేటు పెంచేసిందని టాలీవుడ్ వర్గాల టాక్. బలుపు సినిమాలో అంజలి పోషించిన పాత్ర చిన్నదే అయినా, కథకు ఆ పాత్ర ముఖ్యం కావడంలో క్రెడిట్ ఈమెకు కూడా దక్కింది. ఇటీవల ఈమె దగ్గరకి వెళ్లిన వారికి ఈ రేటు అమల్లోకి వస్తుందని చెబుతుందట.. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... వరుస ప్లాపులతో ఉన్న మాస్ రాజాకి ఈ సినిమా ఊపిరి పోసింది. ‘బలుపు ’ చిత్రం తొలి రోజు టోటల్గా దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఒక ఆంధ్రప్రదేశ్లోనే రూ.3.9 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కచ్చితమైన లెక్కల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా అంజలికి, రవితేజకి హిట్ తెచ్చిపెట్టిన ఈ చిత్రం రెండో వారం కూడా అదే జోరుతో దూసుకుపోతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more