ప్రపంచ అందాల సుందరి గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ కొన్ని రోజుల క్రితం పడ్డంటి బిడ్డకి జన్మనిచ్చి, ఆ తరువాత నుండి ముఖానికి రంగేసుకోకుండా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈమె మళ్ళీ వెండితెర పై రీ ఎంట్రీ చేయబోతుందనే వార్తలు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. తల్లి అయిన తరువాత ప్రముఖ జువెల్లరీ షాపు అయిన కళ్యాన్ జువెల్లర్స్ కి ప్రచారం చేయడానికి కమీట్ అయి, బుల్లితెర పై హల్ చేస్తూ తనలో ఏ మాత్రం అందాలు తగ్గలేదని చెప్పకనే చెప్పింది. ఇటీవల పూణేలో కళ్యాణ్ జువెల్లరీ బ్రాంచిని ప్రారంభించడానికి వచ్చిన ఐష్ ని మీడియా రీఎంట్రీ విషయం పై అడగ్గా, తాను సినిమా ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేదని, కొంత కాలం సినిమాలకు సైన్ చేయలేదు అంతే. అంత మాత్రానికి ‘రీ ఎంట్రీ' ట్యాగ్ తగిలించడం దేనికి అని కాస్తంత ఘాటుగా చెబుతూనే, వెండితెరకు దూరంగా ఉన్నంత మాత్రాన సినిమా రంగాన్ని వదిలేసినట్లు కాదని, ఒకవేళ నేను మళ్లీ ఏ సినిమాకైనా సైన్ చేస్తే మీడియాకు తెలియజేస్తానని చెప్పింది. ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, చాలా సంతోషంగా ఉన్నానని, మాతృత్వపు అనుభూతి ఎంతో హాయిగా ఉందని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ అంతగా బయటకే రాని ఈ ముద్దుగుమ్మ. ఈమధ్యనే అన్నిటికీ అందంగా తయారై హాజరవడం లో పలువురు నిర్మాతలు ఐష్ ని తన సినిమాలో నటించమని వెంబడిపతున్నారట. . ఇటీవల కరణ్ జోహార్ ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించాడని, హృతిక్ రోషన్ హీరోగా రూపొందించే ‘శుద్ధి' అనే సినిమాలో నటించాల్సిందిగా కోరాడని సమాచారం. ఉన్న మాట అంటు ఉలుకెక్కవ అన్నట్లు, రీ ఎంట్రీ గురించి అడిగినందుకే ఇంత ఫీలవ్వాలా అని అక్కడి జనం అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more