Pawan kalyan green signal to dil raju

Pawan Kalyan green signal to dil raju, pawan kalyan- dil raju combo, Dil Raju to produce pawan kalyan movie,

Pawan Kalyan green signal to dil raju, pawan kalyan- dil raju combo, Dil Raju to produce pawan kalyan movie,

దిల్ కోరిక ఇన్నాళ్ళకు తీరబోతుంది

Posted: 08/30/2013 11:02 AM IST
Pawan kalyan green signal to dil raju

టాలీవుడ్ లో మెగా ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు ఒక్క పవన్ కళ్యాన్ కి తప్ప. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుండి పవన్ కళ్యాణ్ తో తన బ్యానర్లో ఒక్కసినిమా అయినా చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఇంత వరకు అది సాద్యం కాలేదు. ఆ మధ్యన దిల్ రాజు నిర్మించిన మల్టీ స్టారర్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ గత కొన్ని రోజుల నుండి దిల్ రాజు-పవన్ కళ్యాణ్ కాబింనేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందని ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు నిజమనే వార్తలు ఫిలిం నగర్ నుండి వెలువడుతున్నాయి. దిల్ రాజు బ్యానర్లో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, పవన్ కి సరిపోయే కథను, దర్శకుడిని వెతికే పనిలో దిల్ రాజు మునిగిపోయాడని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కమీట్ అయిన సినిమాల తరువాత ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఇక దిల్ రాజు చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు భారీ పెట్టుబడి పెట్టి కూర్చున్నాడు. ఆ సినిమాల విడుదలకు ఆటంకాలు ఏర్పడటంతో సతమతం అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles