New talent as in ram charan teja

new talent as in ram charan teja, Ram Charan Teja, mega power star, telugu actor ram charan teja

new talent as in ram charan teja

రామ్ చరణ్ లో దాగి ఉన్న మరో కోణం?

Posted: 09/03/2013 04:32 PM IST
New talent as in ram charan teja

తండ్రి నుంచి నట వారసత్వాన్ని..ఆయన డ్యాన్సింగ్‌లో స్టైల్‌ని పుణికి పుచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోన్న హీరో రామ్‌చరణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా పెద్ద హీరోల్లో అంతర్లీనంగా దాగి ఉన్న విషయాలను తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి విషయాలు ఒక్కోసారి అకస్మాత్తుగా బయటబడుతుంటాయి. ఇప్పటి వరకు చరణ్‌ మనందరీకి ఒక నటుడిగానే సుపరిచితం. కానీ ఆయనలో మనకి తెలియని మరోకోణం కూడా ఉంది. ఆ విశేషం ఎమిటంటే ఆయనలో మంచి సింగర్‌ కూడా దాగి ఉన్నాడు. ఏడేళ్ల పాటు ఆయన కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని చెర్రీనే స్వయంగా ప్రకటించాడు. బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌' ప్రమోషన్‌లో భాగంగా 'ఇండియన్‌ ఐడల్‌' జూనియర్‌ ఫైనల్స్‌కి అతిథిగా వెళ్లాడు చరణ్‌. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ'గాయకులుగా ఉన్నత స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే గాని ఆ కష్టం విలువ తెలియదు. ఏడేళ్లపాటు నేను కూడా కర్నాటక సంగీతం నేర్చకున్నా' అన్నారు. గతంలో చిరంజీవి తన సినిమాల్లో ఒకటిరెండు పాటలు పాడారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా సింగర్‌గా ప్రేక్షకులకు సపరిచితమే. మరీ తండ్రి, బాబాయ్‌ల్లా చరణ్‌ గళం కూడా త్వరలో వినిపిస్తుందేమో వేచి చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles