Director krishna vamsi has inspired me actor vishnu

Director Krishna Vamsi has inspired me-Actor Vishnu, Director Krishna Vamsi, manchu vishnu,

Director Krishna Vamsi has inspired me-Actor Vishnu

మంచు విష్ణు మార్పుకు కారణం అతనే

Posted: 10/07/2013 01:57 PM IST
Director krishna vamsi has inspired me actor vishnu

మంచు కుటుంబం నుండి ఇద్దరు హీరోలు తెరపైకి వచ్చారు. ఆ ఇద్దరికి నటనపై ఉన్న నమ్మకమే ఈ రోజు టాలీవుడ్ లో టాప్ హీరోలకు చేర్చింది. తండ్రి క్షమశిక్షణలో పెరిగిన ఇద్దరుహీరోలు.. టాలీవుడ్ లో తనకంటూ.. ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మరి కొద్ది రోజుల్లో మంచు విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది విష్ణు స్లిమ్ అండ్ కండలు తిరిగిన బాడీ గురించే మాట్లాడుకుంటున్నారు. తన బాడీ లుక్ విషయంలో తనకు వస్తున్న ప్రశంశలు అన్ని కృష్ణ వంశీకి చెందాలని అంటున్నారు. తను అలా స్లిమ్ గా మారడానికి గల విషయాన్ని చెబుతూ ‘ నేను కృష్ణవంశీ గారిని కలిసి నాతో ఓ యాక్షన్ సినిమా చెయ్యమని అడిగాను. అప్పుడు నేను లావుగా ఉండడం చూసిన ఆయన నాతో కామెడీ సినిమా చేస్తానని చెప్పాడు. దాన్ని కాస్త అవమానకరంగా భావించిన నేను మూడు రోజుల్లో జిమ్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నా బాడీని ఇలా ఫిట్ గా మార్చుకున్నానని’ చెప్పాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles