షూటింగు, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రామ్ చరణ్ సినిమా ‘ఎవడు ’ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటికే ల్యాబ్ లోనే మూలుగుతున్న విషయం తెలిసిందే. కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ఇప్పుడిప్పుడే అవి సద్దుమనుగుతుండటంతో ఈ సినిమా విడుదల తేదీని ఫైనల్ గా ప్రకటించాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను క్రిస్ మన్ పండగ వేల అనే డిసెంబర్ 19వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇతను నిర్మించిన ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసి, ఈ సినిమాను ఆపడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. చరణ్ ‘తుఫాన్ ’భారీ పరాజయం తరువాత ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, అందులో భాగంగానే కొన్ని సీన్లు రీ షూట్ చేస్తున్నారని అందుకే వాయిదా పడిందని మరో కారణం కూడా వినిపించింది. అయితే ఎప్పుడు ‘ఎవడు ’ కి ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, ఎలాంటి రీ షూట్లు లేకుండా ఉన్నది ఉన్నట్లు విడుదల చేయనున్నట్లు దిల్ రాజు తెలపడంతో మెగా అభిమానులు ఆ సినిమా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే దసరా, సంక్రాంతి, దీపావళి సీజన్లను మిస్సయిన ఈ సినిమా క్రిస్ మస్, సంక్రాంతి సీజన్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. తెలుగుతోపాటు మలయాళ వెర్షన్ కూడా అదేరోజు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చెర్రీ సరసన శృతిహాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more