Murder attempt on young tiger jr ntr

Murder attempt on Young tiger, Murder attempt on Young tiger Jr NTR, Action at Hero Jr.NTR's Residence, residence of Jr.NTR Jubilee Hills, intruder break into the Jr.NTR Residence, Jr.NTR Residence, unidentified man break into Jr.NTR Residence

Murder attempt on Young tiger Jr NTR. There was an action took place at the residence of Jr.NTR at Road No.37, Jubilee Hills Hyderabad.

జూనియర్ పై మర్డర్ ప్లాన్ చేశారా ?

Posted: 11/05/2013 08:45 PM IST
Murder attempt on young tiger jr ntr

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి ఆదివారం రాత్రి ఓ అగంతకుడు దొంగతనానికి విఫలయత్నానికి ప్రయత్నించాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 37లోని ఎన్టీఆర్‌ ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి గోడదూకి ప్రవేశించడాన్ని చూసిన సెక్యురిటీ గార్డ్స్‌ అప్రమత్తం అవ్వడంతో ఆ అపరిచితుడు పారిపోయాడు.

ఈ సంఘటన కలకలం రేపడంతో జూనియర్ ఎన్టీఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పక్కనే ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇంటిముందు సిసి కెమెరాల్లో రికార్డ్  అయిన సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  ఈ పుటేజిల్లో అగంతకుడు నెంబర్ ప్లేట్ లేని వాహనం పై వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ప్రక్కన పెడితే....

అంతర్జాలంలో మాత్రం పలు రకాల వార్తలు సంచరిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇంట్లో అపరిచిత వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడని అంటుంటే, మరికొందరు అగంతకుడు లైసెన్స్ లేని తుపాకీ పట్టుకొని వచ్చాడని,  ఆయన పై మర్డర్ అటెంప్ట్ చేయడానికి వచ్చాడని కొంతమంది రాసుకుంటే, మరికొంత మంది ఎన్టీఆర్ సెక్యూరిటీ అప్రమత్తం అవ్వడంతో వరండాలో ఉన్న తుపాకీని దోచుకొని వెళ్ళాడని కొంత మంది రాసుకున్నారు.

ఇందులో నిజం ఏదో తెలియదు కానీ, ఎన్టీఆర్ పై మర్డర్ అటెంప్ట్ అనే వార్త సంచలనాలకు తెరలేపుతుంది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పై ఎవరైనా పగబట్టారా ? లేక కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles