Mahesh 1 nenokkadine audio launch telecast in theaters

1 Nenokkadine audio launch telecast in theaters,videos,Mahesh Babu, Hyderabad, theaters,December 14,Mahesh babu 1-Nenokkadine,1-Nenokkadine,Mahesh Babu Nenokkadine,1 Nenokkadine audio launch

Mahesh Babu starrer 1 Nenokkadine will take pace on December 14 in Hyderabad on a grand scale.

ఆడియోలో కొత్త ట్రెండ్... థియేటరల్లలో

Posted: 11/13/2013 12:28 PM IST
Mahesh 1 nenokkadine audio launch telecast in theaters

గతంలో ఆడియో ఫంక్షన్లను సాదా సీదాగా నిర్వహించేవారు. కానీ ట్రెండ్ మారింది. స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లను గ్రాండ్ గా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కి ఇంకో అడుగు ముందుకేసి ఆడియో ఫంక్షన్లను పలు థియేటర్లలో లైవ్ లో నిర్వహించేందుకు మహేష్ సినిమాతో శ్రీకారం చుట్టబోతున్నారు.

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘1’ నేనొక్కడినే చిత్రం ఆడియోను వచ్చేనెల 14 వ తేదీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరగబోయే ఈ ఆడియో ఫంక్షన్ ని రొటీగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో నిర్వహించబోతున్నారు. అందుకోసం రాష్ట్రంలో కొన్ని ప్రధాన థియేటర్లని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ నిర్వహించే ఈ ఫంక్షన్ ని లైవ్ లో అక్కడి వారికి ముందు ఉంచబోతున్నారన్న మాట. 

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోకి ముఖ్య అతిథిగా బాలక్రిష్ణ రాబోతున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మహేష్ సరసన కృతి సనన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles