Ram charan yevadu full movie leaked

Ram charan Yevadu Full Movie Leaked, Ram charan Yevadu movie, Ram charan Yevadu release date, Yevadu release on Dec 19, Producer Dil Raju, Ram charan, Shruti hasan

Here comes another movie in the list, Ram Charan Yevadu movie got leaked. Some unknown persons created a rumour that in Guntur 2 hours and 16 minutes footage of Yevadu is readily available in the market in the form of CDs.

‘ఎవడు ’ మొత్తం బయటికొచ్చేశాడు ?

Posted: 11/21/2013 07:31 PM IST
Ram charan yevadu full movie leaked

ఇటీవలే టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది ’ విడుదలకు ముందే మార్కెట్లోకి వచ్చి పెద్ద గందరగోళానికి గురిచేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీనే అదిరిపోయేటట్లు చేసిన విషయం తెలిసిందే. కానీ దాని ఎఫెక్ట్ ఆ సినిమా పై ఏ మాత్రం పడకపోగా , టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ స్టోరీ మాకు తెలిసిందే కదా ? మళ్ళీ ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ? విషయం ఏంటంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు ’ సినిమా పూర్తిగా లీక్ అయ్యిందని టాలీవుడ్ వర్గాల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు వ్యక్తులు ఈ సినిమా 2 గంటల 16 నిమిషాలు మార్కెట్లో సీడీల రూపంలో లభ్యం అవుతుందని మెస్సేజ్ ల రూపంలో ప్రచారం చేశారు. ఈ వార్త దావాహంలా మార్కెట్లోకి వెళ్ళడంతో... ఈ విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ సభ్యులు షాక్ తిని దీని పై ఆరా తీయగా

ఈ వార్త అంతా ఉత్తిదే అని తేలడంతో నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్ సభ్యులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంత మంది సినీ జనాలు మాత్రం ఈ సినిమా వచ్చే నెల 19 తేదీన విడుదల కాబోతుండటంతో జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికే ఇలాంటి ప్రచారం చేశారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles