1 nenokkadine item song shot in mumbai

1 Nenokkadine item song shot in Mumbai, Nenokkadine item song shot, 1 movie item song, Ringa Ringa in Arya 2, and Diyyalo Diyyalo, sukumar director,

1 Nenokkadine item song shot in Mumbai, Nenokkadine item song shot, 1 movie item song, Ringa Ringa in Arya 2, and Diyyalo Diyyalo, sukumar director,

కత్తిలాంటి పోరితో చిందేసిన మహేష్

Posted: 11/27/2013 12:42 PM IST
1 nenokkadine item song shot in mumbai

సుకుమార్ సినిమా అంటే మంచి లవ్ స్టోరీ తో పాటు ఓ మాంచి మాస్ మసాలా ఐటెం సాంగు కూడా ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది. ఇప్పటి వరకు తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో ఓ ఐటెం సాంగ్ పెట్టి ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగించాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘1’ నేనొక్కడినే సినిమాలో కూడా మమహేష్ బాబు స్థాయికి తగ్గట్టుగా 'కత్తి'లాంటి ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.

ఈ పాటలో మహేష్ తో పాటు బాలీవుడ్ మోడల్ సోఫియా చౌదరి డ్యాన్స్ చేసింది. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీలో ఈ పాటను ముంబయ్ చిత్రీకరించారు. మహేష్ అభిమానులను ఈ పాట ఓ ఊపు ఊపేస్తుంద. ఈ పాటకు దేవీ శ్రీ తనదైన స్టైల్లో సంగీతం అందించాడని అంటున్నారు. ప్రస్తుతం ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మిగిలి ఉన్న పాటను త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

డిసెంబర్ 22న వినూత్నంగా పాటలను, జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. మరి తొలిసారిగా మహేష్ తో  చిందేస్తున్న సోఫియా ఆమె అందాలతో ప్రిన్స్ అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles