Venkatadri express director gandhi get big offers

venkatadri express director gandhi get big offers, Merlapaka Gandhi, Best Director Merlapaka Gandhi, Venkatadri Express director Merlapaka Gandhi

venkatadri express director gandhi get big offers

గాంధీకి సుడి తిరిగినట్లేనా?

Posted: 12/04/2013 01:58 PM IST
Venkatadri express director gandhi get big offers

టాలీవుడ్ లో కొత్త నీరు ప్రవహిస్తుంది. యువ హీరోలు, యువ దర్శకులు వెండితెరపై చెలరేగిపోతున్నారు. ఒకప్పుడు దర్శకుడు కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. నీలో టాలెంట్ పుష్కలంగా ఉంటే చాలు తెల్లరేసరికల్లా నీవు దర్శకుడిగా మారిపోయే రోజులు టాలీవుడ్ లో కనిపిస్తున్నాయి గతంలో అనుభవం కోసం సీనియర్ దర్శకుల వద్ద కొన్ని సంవత్సరాల కష్టాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు అనుభవం ముఖ్యం కాదు టాలెంట్ ఉంటే చాలు అని యువ దర్శకులు నిరూపిస్తున్నారు.

 

అలాంటి వారిలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధి. ప్రస్తుతం థియేటర్స్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హల్ చల్ చేస్తుంది. యువ హీరో సందిప్ కిషన్ తో దర్శకుడు మేర్లపాక గాంధీ చేసిన ప్రయోగం సక్సెస్ కావటంతో టాలీవుడ్ నిర్మాతల కన్ను గాంధీ పై పడింది. చిన్న చిత్రాల్లో పెద్దవిజయం సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు.

 

తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని విజయ తీరాలకు చేర్చిన ఈ దర్శకుడికి అభినందనలతో పాటు ఆఫర్లు కూడా వచ్చిపడుతున్నాయి. డి.సురేష్ బాబు, బెల్లం కొండ సురేష్, బండ్ల గణేష్ లు గాంధీని అభినందించడంతో పాటు కథలు ఉంటే మేము నిర్మాతగా మారితాని చెబుతున్నారు. అయితే గాందీ సుడి తిరిగినట్లే అని టాలీవుడ్ వాసులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles