Ntr ram charan allu arjun multi starrer movie

junior ntr, ram charan teja, allu arjun, dil raju, venu sriram, kalisi unte kaladu sukham, multi-starrer movie

Dilraju, one of the leading Tollywood producers, is said to be considering on doing a family drama with popular young actors like Junior NTR, Ram Charan Teja and Allu Arjun.

వీరు ముగ్గురు కలిసి ఒకే సినిమాలో...

Posted: 12/13/2013 09:48 AM IST
Ntr ram charan allu arjun multi starrer movie

ఒకప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ అనే కాకుండా అన్ని భాషల్లో మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని అలరించేవి. అలా వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచి నిర్మాతలకు కాసులు కురిపించిన రోజులు ఉన్నాయి. తరువాత తరువాత స్టార్ హీరోల హవా పెరిగి సింగిల్ స్టారర్ చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ బాలీవుడ్ లో కొనసాగుతున్నా మన టాలీవుడ్ లో మాత్రం మళ్ళీ ఇటీవలే మొదలైంది.

ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు చాలా మంది దర్శకులు మల్టీ స్టారర్ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ త్రయం కలిసి ఓ సినిమా చేస్తుండగా, మంచు ఫ్యామిలీ వారు కూడా ఓ చిత్రం చేస్తున్నారు. దగ్గుబాటి హీరోలు కూడా ఓ చిత్రం చేసే ప్లాన్ లో ఉన్నారు. దిల్ రాజు ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు చేస్తుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సిద్ధార్థ్ హీరోగా 'ఓ మై ఫ్రెండ్' చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ రూపొందించిన ఓ ఫ్యామిలీ కథకు ఇప్పుడు దిల్ రాజు భారీ క్యాస్టింగ్‌ను పట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్‌ను 'కలసి వుంటే కలదు సుఖం' అని ఖరారు చేశారట.

ఈ సినిమా ఉమ్మడి కుటుంబాలలోని మాధుర్యాన్ని తెలియజెప్పేలా వుంటుందని, ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్-బన్నీలను కూడా అప్రోచ్ అయ్యాడని ఫిలింనగర్‌లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మరి వీరు ముగ్గురు కలసి నటించడానికి సై అంటారా ? ఒకవేళ అంటే మాత్రం ముగ్గురు అభిమానులకు పండడే పండగ.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles