Dhoom 3 earns rs 500 crore

dhoom 3, aamir khan, boxofficeindia.com, katrina kaif, abhishek bachchan, uday chopra, yash raj films, 3 idiots, ek tha tiger, yeh jawaani hai deewani

Dhoom 3, the latest instalment of Bollywood successful action adventure franchise, has grossed Rs 501.35 crore.

ధూమ్ - 3 ఐదు వందల కోట్లు దాటింది

Posted: 01/07/2014 11:05 AM IST
Dhoom 3 earns rs 500 crore

బాలీవుడ్ సినిమాలు మెల్లిమెల్లిగా హాలీవుడ్ సినిమాల రేంజ్ లో వసూళ్ళను సాధిస్తున్నాయి. మొన్నటి వరకు 100 కోట్లు దాటితే గొప్ప సినిమా అన్నారు... అది కాస్త 200 కోట్లు, 300 కోట్లు దాటి ఇప్పుడు 500 కోట్లకు చేరింది. ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ సినిమా ధూమ్ -3 రికార్డు స్థాయిలో 500 కోట్ల మార్కును దాటింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇన్ని కోట్లు వసూలు చేసింది. డిసెంబర్ 20 తేదిన విడుదలైన ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా 501.35 (83.56 మిలియన్ డాలర్లు) కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం స్వదేశంలో 351 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం జర్మనీ, పెరూ, రొమెనియా, జపాన్, రష్యా, టర్కీ దేశాల్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇన్ని కోట్లు వసూలు చేయడంతో నిర్మాతలు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వచ్చిన ధూమ్ చిత్రాలకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఉండటమే ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని అంటున్నారు. కత్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు మిగతా పాత్రల్లో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles