పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ లో బిజీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ లో సునామీ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త గొబ్బర్ సింగ్ -2 సినిమా ను సెట్స్ పైకి తేవటానికి భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ -2 సినిమాకు ముహూర్తం కుదిరిందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.
ఈ నెల 21న ఉదయం ఆరు గంటలకు హైదరాబాదు, ఫిలిం నగర్లోని దైవసన్నిధానమ్ ప్రాంగణంలో ఈ సినిమా ముహూర్తాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగును మాత్రం మార్చి నెలాఖరు నుంచి జరుపుతారని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.
ఇదిలా ఉంచితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. మరోపక్క కథానాయిక అన్వేషణ కూడా సాగుతోంది. 'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శరత్ మరార్ దీనిని నిర్మిస్తున్నాడు.
ప్రిన్స్ కు షాకిచ్చిన నిర్మాత
మహేష్ బాబుక తొలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో ఓ మూవీ చేస్తానని ప్రిన్స్ మహేష్ రీసెంట్ గా ప్రకటించాడు. దీనికి కారణం అశ్వనీదత్ కు ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేవు. దీంతో ఒక్క సినిమా అవకాశం ఇచ్చి ఆదుకోవాలనుకున్నాడు మహేష్.
కానీ డైరెక్టర్ పూరీతో చెప్పించిన స్టోరీ అశ్వనీదత్ కు నచ్చకపోవటంతో.. నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాక అశ్వనీదత్ మహేష్ తో చేయాలనుకున్న సినిమా తమిళ దర్శకుడు రాజ్ డికే చెప్పిన స్టోరీగా ఉండటంతోనే దర్శకుడు పూరీ స్టోరీ పై నిర్మాత అశ్వనీదత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని టాక్.
అయితే నిజానికి రాజ్, డికె చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదని సమాచారం. ఆ కథతో సినిమా చేస్తే అశ్వనీదత్ మరింత నష్టపోతాడనే పూరీతో సినిమా చేద్దామనుకున్నాడు. తమ ఇద్దరి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ను బట్టి ఓపెనింగ్స్ వచ్చినా లాస్ నుంచి బయటపడతాడు అశ్వనీదత్.. కానీ అతని ఆలోచనలు ఇంకా భారీగా ఉన్నాయి.
అందుకే రాజ్, డికె ఈ కథను తమిళ స్టార్ హీరో సూర్యతో ఓకే చేయించారు. ఆ కథతో ఆ దర్శకులతోనే ఇప్పుడు సూర్యతో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట అశ్వనీదత్. దీంతో అశ్వనీదత్ కు మేలు చేద్దామనుకున్న మహేష్ కు షాక్ తగిలిందనే చెప్పాలి.
కానీ, ప్రస్తుతం అశ్వనీదత్, మహేష్ సినిమా ఆగిపోయింది.. తద్వారా ప్రిన్స్, పూరీ కాంబినేషన్ ప్రస్తుతానికి క్యాన్సిల్ అయిందని, అలాగే క్యాన్సిల్ అయిందనుకుంటున్న మహేష్, కొరటాల శివ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందని మాత్రం వినిపిస్తోంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more