Chiru chief guest in bunny race gurram

Race Gurram, Allu Arjun, Sruthi Haasan, Race Gurram, Chiru chief guest in Bunny race gurram, Megastar Chiranjeevi, Surendar Reddy, Romance Audio Launch.

Chiru chief guest in Bunny race gurram

బన్ని పాటల సందడిలో..చిరంజీవి అలజడి?

Posted: 03/15/2014 06:52 PM IST
Chiru chief guest in bunny race gurram

మన బన్నీ సందడిలో..కేంద్ర మంత్రి  చిరంజీవి  అలజడి ఉంటుందని  సినీ పెద్దలు అంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న "రేసు గుర్రం" సినిమా ఆడియో మార్చి 16 న విడుదల కానుంది. పెద్దగా హడావిడి లేకుండా ఈ వేడుకని జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకని మా మూవీస్ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. 

పార్క్ హయత్ లో జరగనున్న ఈ వేడుకని శృతి హాసన్ తప్ప మిగిలిన ఈ చిత్ర యూనిట్ అంతా హాజరవుతారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకి ముఖ్య అతిదిగా వస్తున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ ఆల్బమ్ ని మార్కెటింగ్ చేస్తుంది. 

తమన్ సంగీతం అందించిన  ఈ చిత్రం అనధికారికంగా విడుదలైపోయాయి, ఏదేమైనా పాటలకి మంచి స్పందనే వస్తుంది. సలోని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమలపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాత.  ఈ పాటల పండుగ అతి కొద్ది సమక్షంలో జరుగుతుందని అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles