Manam trailer gets good response from youtube

Manam Movie Trailer, Manam theatrical trailer, naga chaitanya, akkineni nageswara rao,Manam,Movie trailer,Nagarjuna, ANR

Manam Trailer Gets Good Response from youtube.

యూ ట్యూబులో అదరగొడుతున్న ‘మనం ’

Posted: 04/10/2014 10:20 AM IST
Manam trailer gets good response from youtube

‘ఇష్క్ ’ సినిమా ఫేం విక్రమ్ కుమార్ తన రెండవ సినిమానే అక్కినేని ఫ్యామిలీతో మల్టీ స్టారర్ చిత్రాన్ని చేసే ఛాన్స్ ని కొట్టేశాడు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు నటించిన ‘మనం ’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గత రెండు రోజలు క్రితం అంటే ఈనెల 7వ తేదీన విడుదల అయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదల అయిన రెండు రోజుల్లోనే ఈ ట్రైలర్ ని నాలుగు లక్షల మందికి పైగా చూడటం బట్టి చూస్తుంటే సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
చిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles