Boyapati to launch balakrishna son mokshagna

Balakrishna son Mokshagna, Director Boyapati Srinu, Legend director boyapati, Jr.NTR, Tarak, Kalyan Ram, Mokshagna debut in Tollywood.

Boyapati is given the responsibility of launching Balakrishna son Mokshagna.

బాలయ్య కొడుకును బొయపాటి చేతిలో...

Posted: 04/15/2014 10:33 AM IST
Boyapati to launch balakrishna son mokshagna

నందమూరి నటసింహం బాలయ్యకు తన కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడమే కాకుండా అత్యధికంగా వసూళ్ళు సాధించే సినిమాలు తీసిన మాస్ దర్శకుడు బోయపాటి శీను పై బాలయ్యకు అపారమైన నమ్మకం ఏర్పడిందట. సింహా, లెంజెండ్ లాంటి హిట్టు సినిమాలు ఇచ్చిన దర్శకుడి చేతిలోనే బాలయ్య తనయుడు, యువ నట సింహం మోక్షజ్ఞను హీరోగా వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను బోయపాటికి అప్పజెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజుల నుండి ఏ దర్శకుడి చేతిలో పెట్టాలని ఆలోచిస్తున్న బాలయ్యకు బోయపాటి అయితేనే కరెక్ట్ అని, నందమూరి వంశానికి తగ్గట్లు డైలాగులతో పాటు, యాక్షన్ అండ్ రొమాంటిక్ హీరోగా చూపించగడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని  ‘లెజెండ్ ’ నిర్మాణ సంస్థలు అయిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, వారాహి చలనచిత్రం సంస్థలకే అప్పజెప్పాడట.

టాలీవుడ్ లో తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేడానికి నానా తంటాలు పడుతుంటే బాలయ్య మాత్రం చాలా ధైర్యంగా బోయపాటికి అప్పగించాడని అంటున్నారు. మరి బాలయ్య నమ్మకాన్ని బొయపాటి నిలబెడతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles