Big b amitabh guest role in manam movie

Amitabh Bachchan, Nagarjuna, Manam, ANR, Naga Chaitanya, Big B Nagarjuna Manam

The 71-year-old actor, who is busy shooting for his next film with R Balki, shared the details about the Manam shoot and other commitments with fans on his blog.

‘మనం ’ సినిమాలో అమితాబ్ గెస్ట్ గా

Posted: 04/29/2014 03:43 PM IST
Big b amitabh guest role in manam movie

అక్కినేని త్రయం కలిసి నటించిన సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడనే వార్త టాలీవుడ్ లో గత మూడు నాలుగు రోజుల నుండి సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో అని సినీ జనాల్లో కాస్త అనుమానం ఉండేది. కానీ వాటన్నింటికి తెర దించుతూ... స్వయంగా అమితాబే ‘మనం ’ సినిమాలో నటిస్తున్నట్లు తన బ్లాగ్ లో వెల్లడించాడు.

ఈ విషయాన్ని తన బ్లాగ్ లో ప్రస్తావిస్తూ... ‘దిగ్గజ నటుడు, నా మిత్రుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునతో కలిసి ‘మనం ’ సినిమాలో అతిథి పాత్ర పోషించాను. ఆ షూటింగ్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. దీంతో అమితాబ్ ఆ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడని నిర్ధారణకొచ్చారు.

ఈ సినిమా కంటే ముందే నాగార్జున, అమితాబ్ లు ప్రముఖ కళ్యాణ్ జ్యువెల్లరీ సంస్థ యాడ్ లో నటించారు. అంతకంటే ముందు ‘ఖుదాగువా ’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉది. ఆ స్నేహం కారణంగానే నాగ్ అడిగిన వెంటనే అమితాబ్ చిన్న పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడట. ఇప్పటికే ట్రైలర్ పరంగా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles