Bunny to do cameo in rudhramadevi

Bunny to do cameo in Rudhramadevi , Allu Arjun to play cameo in Rudhramadevi, Allu Arjun special appearance in Rudhramadevi, Allu Arjun, Rudhramadevi, Gunasekhar, Allu Arjun to do cameo in Rudhramadevi

Stylish Star Allu Arjun will be doing a special appearance in director Gunasekhar'a magnum opus project Rudhramadevi.

‘గోన గన్నారెడ్డి ’గా కనిపించ బోతున్నాడు

Posted: 05/31/2014 10:49 AM IST
Bunny to do cameo in rudhramadevi

భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో సొంత బ్యానర్ లో గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న హిస్టారిక్ సినిమా ‘రుద్రమ దేవి ’. ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది నటుల్ని తీసుకున్నగుణ ఇప్పుడు అల్లు అర్జున్ ని కూడా తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా కీరోల్ గా చెప్పబడే గోన గన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఈ పాత్ర కోసం చాలా మంది టాలీవుడ్ హీరోల పేర్లు వినిపించాయి. మొదట మహేష్ బాబును సంప్రదించిన గుణశేఖర్ కి అతని నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి షూటింగు పూర్తి దశకు చేరుకోవడంతో ఈ పాత్ర కోసం బన్నీని సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పాడని, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వరుడు ’ సినిమా ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించకపోయినా, గుణశేఖర్ మీద ఉన్న అభిమానంతోనే బన్నీ ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు.

అర్జున్ ‘గోన గన్నారెడ్డి ’ గా ఎలా ఉండబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో అనుష్క, రాణా లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles