Mega star start workouts for body fitness

Chiranjeevi start gym workouts, Mega star start workouts body fitness, Chiranjeevi Ready For 150th Movie, Union Minister Chiranjeevi

Mega star start workouts for body fitness, Now he is planning to act in his 150th movie.

గ్లామర్ పెంచే పనిలో పడిన చిరంజీవి

Posted: 05/31/2014 03:55 PM IST
Mega star start workouts for body fitness

మెగాస్టార్ చిరంజీవి గడిచిన ఐదేళ్లలో రాజకీయాల్లో బిజీబిజీగా గడిపారు. ఇటీవల జరిగిన సార్వంత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో చిరుకు రాజకీయాల్లో పెద్దగా పనిలేకుండా పోయింది. కేంద్రమంత్రిగా ఉన్నప్పటి నుండే తాను సినిమాల్లోకి వచ్చి బ్యాలెన్స్ 150 సినిమా చేస్తానని చెప్పిన చిరు ఇప్పుడు దానికి సంబంధించిన పనిలో బిజీ అయ్యాడట. గత కొన్నాళ్ళ నుండి కథల మీద వర్కౌట్స్ చేసిన చిరు బాడీ వర్కౌట్స్ చేస్తున్నాడట. ప్రస్తుతం చిరు ఎక్కువగా జిమ్ లోనే గడుపుతున్నారట. రాజకీయాల్లో వుండగా బాడీపై శ్రద్ధ పెట్టలేకపోయిన ఈయన దానికి మళ్లీ ఓ షేపు తీసుకొచ్చే పనిలో పడ్డాడట.

వ్యాయామ నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్న ఈయన తన గ్లామర్ ని అభిమానులకు చూపించాలంటే ఈ మాత్రం కష్టం తప్పదని అంటున్నాడట. వాస్తవానికి చిరు రాజకీయ టూర్లు, ప్రచారాల వల్ల కాస్త డీ గ్లామర్ గా తయారు అయ్యారు. రంగు, బాడీకి పూర్వవైభం తీసుకొని రావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇటీవల మణిరత్నం కలసి ఓ కథ చెప్పినప్పటికీ, చిరంజీవి మాత్రం వీవీ వినాయక్ తో సినిమా చేయడానికే మొగ్గు చూపుతున్నారు. గతంలో అతనితో 'ఠాగూర్' సినిమా చేసి వుండడం వల్ల తనను ఎలా ప్రెజంట్ చేయాలన్న విషయంలో వినాయక్ కు నిర్ధిష్టమైన ఐడియా వుంటుందన్నది చిరంజీవి ఆలోచన. చిరు చేయబోయే సినిమా రాయలసీమ పోరాట యోధుడు ‘ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ’ కథ ఆధారంగా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం పరుచూరి సోదరులు, చిన్నికృష్ణ కలసి ఈ సినిమాకు సంబంధించిన కథను వండుతున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles