10 crores demand for bahubali satellite rights

10 crores demand for bahubali satellite rights, Prabhas, Rana, Anushkha, Tamannaah, S S Rajamouli's, Bahubali Release date, Baahubali Release date, Bahubali Telugu Release date, Bahubali Release Date

10 crores demand for bahubali satellite rights, Prabhas, Rana, Anushkha, Tamannaah, S S Rajamouli's, Bahubali Release date, Baahubali Release date, Bahubali Telugu Release date, Bahubali Release Date

శాటిలైట్స్ రైట్స్ లో కొత్త రికార్డు సృష్టించబోతుందా ?

Posted: 06/18/2014 12:39 PM IST
10 crores demand for bahubali satellite rights

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా అంత్యంత భారీ బడ్జెట్ తో, అగ్ర నటీ నటులతో రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పటమే కాకుండా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టారు. మొదటి నుండి ఈ సినిమాను 2015 లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెబుతున్నా, ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేదు. ఈ సినిమాను ఏప్రిల్ 17, 2015 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు సినిమా వర్గాల సమాచారం.

దీని పై అధికారిక ప్రకటన త్వరలోనే చేయడమే కాకుండా, ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పబోతున్నారట. సినిమా విడుదల తేదీ పై వార్తలు రావడంతో ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ కోసం చాలా మంది పోటీపడుతున్నట్లు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే డిమాండ్ చాలా ఉంటుంది. ఇక భారీ బడ్జెట్ తో తీస్తున్న చిత్రం కావడం, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ ఘట్టంగా మిగిలిపోతుందని చెబుతుండటంతో ఈ సినిమాకు 10 కోట్లకు పైగా చెల్లించడానికి ప్రముఖ టెలివిజన్ ఛానల్స్ పోటీ పడుతున్నాయట.

శాటిలైట్స్ రైట్స్ కే ఇంత డిమాండ్ ఉంటే ఓవర్సీస్ రైట్స్ 15 కోట్ల వరకు పలక వచ్చని అంటున్నారు. చిత్రంలో ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కేరళలో ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles