Vidya balan to spy on big b namo

Vidya Balan spy on Narendra Modi, Vidya Balan spy on BIg B, Prime Minister, Narendra Modi, Bobby Jasoos movie, Vidya balan interview

Vidya Balan says that given a chance she would want to spy on India newly-elected Prime Minister, Narendra Modi.

బిగ్ బి, నమోల బండారం బయట పెడతా : విద్యా

Posted: 06/20/2014 01:32 PM IST
Vidya balan to spy on big b namo

బాలీవుడ్ ఆంటీ విద్యాబాలన్ సిద్దార్థ్ రాయ్ కపూర్ ని పెళ్లి చేసుకున్న తరువాత వెండితెరకు దూరం అవుతుందని అనుకున్నారు. కానీ ఈమె వరుసగా సినిమాలు చేస్తూ తన నట వృత్తికి దూరం కాలేనని నిరూపిస్తుంది. ఇప్పటికే  నేషనల్ అవార్డు, పద్మ శ్రీ అవార్డులు గెల్చుకొని నటనలో తానేంటో నిరూపించుకున్న ఈమె ఇప్పుడు ‘బాబీ జాసూస్ ’ సినిమా లో నటనకు ఆస్కారం ఉన్న  పాత్రల్లో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంటూనే ఇంర్వూలు కూడా ఇస్తుంది.

ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఓ ప్రశ్నకు ఆసక్తిక సమాధానం చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో మీరు డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నారు కదా ... నిజ జీవితంలో డిటెక్టివ్‌గా చేయాల్సివస్తే ఎవరికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటారు అని అడిగితే.. నేను కానీ డిటెక్టివ్ అయితే ముందుగా నరేంద్ర మోడీ రహస్యాలను బయటపెడతానని, ఓ ప్రధానిగా దేశాభివృద్ధి కోసం ఆయన రచిస్తున్న ప్రణాళికలు ఏమిటో సంపాదించి ఆయనకంటే ముందు నేనే బయటపెడతానని నవ్వుతూ చెప్పుకొచ్చింది ఈ భామ.

అలాగే అమితాబ్‌ గారి సినిమాలు, మేనరిజమ్స్ గురించి తెలుసు కానీ, ఆయన గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆ విషయాలు తెలుసుకుంటానిని చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్రలో నటించడానికి ఎందుకు ఒప్పుకన్నారంటే... దేశంలో చాలా స్కామ్స్ పెరిగాయి అలాగే చాలా అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ప్రజలకు ఇలాంటి సినిమా కావాలని కోరుకుంటారు కాబట్టి ఇందులో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles