Sunny leone shivathandav dance steps in leela movie

Sunny leone shivathandav dance steps in leela movie, sunny leone, sunny leone latest news, sunny leone hot photos, sunny leone latest news, sunny leone dancing, sunny leone shivathandav dance steps in leela movie, leela movie release date, leela movie first look

Sunny leone shivathandav dance steps in leela movie

బాలీవుడ్ లో శివతాండవం చేస్తున్న పోర్న్ స్టార్

Posted: 06/26/2014 04:19 PM IST
Sunny leone shivathandav dance steps in leela movie

(Image source from: Sunny leone shivathandav dance steps in leela movie)

‘‘జిమ్మ-2’’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైన పోర్న్ స్టార్ సన్నీలియోన్... తనదైన ట్రెండ్ ను సెట్ చేసుకుంది. బాలీవుడ్ అగ్న కథానాయికలను తలదన్నేసేలా తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న ఈ సెక్సీతార... దాదాపు డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. అందులో భాగంగానే సన్నీ నటిస్తున్న తాజా చిత్రం ‘‘లీలా’’ ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. అప్పుడే ఈ ఫోటోకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కూడా పడ్డాయి.

ఇప్పుడు తాజాగా సన్నీలియోన్ ఇందులో శివతాండవం నృత్యం చేయనుందని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘‘లీలా’’ సినిమాలో సన్నీలియోన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త పాత్రలో నటించబోతోందని, అలాగే శివతాండవానికి సంబంధించిన నృత్యరీతులను చేయనుందని ఆ ఫిల్మ్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాబీఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం సన్నీలియోన్ అహర్నిశలు శ్రమ పడుతోందని వారు పేర్కొంటున్నారు.

సినిమా షూటింగ్ అయిన అనంతరం సన్నీలియోన్ నేరుగా తన రూంకి వచ్చి, శివతాండవానికి సంబంధించిన డ్యాన్స్ స్టెప్స్ ను ప్రాక్టీస్ చేస్తోందని... తీరిక సమయం దొరికినప్పుడల్లా డ్యాన్స్ మాస్టర్ ఇచ్చిన డీవీడీలను తన వెంటే తెచ్చుకుని రిహార్సల్స్ చేస్తోందని యూనిట్ వర్గాలవారు చెబుతున్నారు. బాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం ఇలా రకరకాల పాత్రలను పోషించి, చాలా కష్టపడుతోందని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు.

అయితే ఎక్కడినుంచో వచ్చిన ఈ పోర్న్ స్టార్ ను బాలీవుడ్ వర్గాలవారు నెత్తిన ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారని కథానాయికలు ఈమె మీద గుర్రుగా వున్నట్టు సమాచారం! ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్ సన్నీ మేజిక్ బాగా పనిచేస్తోందని, తమ బిజినెస్ ను మరింతగా పెంచుకోవడానికి సన్నీలియోన్ ఇలా రకరకాలుగా వాడుకుంటున్నారని యూనిట్ సభ్యులు చెప్పకనే చెప్పేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles