Ghantasala daughter in law veena turned as dubbing artist

ghantasala daughter in law veena turned as dubbing artist, ghantasala latest news, ghantasala songs, ghantasala duaghter in law veena, ghantasala son ratnakumar, dubbing artist ratnakumar, dubbing artist veena, ghantasala daughter in law veena latest news

ghantasala daughter in law veena turned as dubbing artist

ఘంటసాల కుటుంబం నుంచి మరో ఆర్టిస్ట్

Posted: 06/27/2014 01:59 PM IST
Ghantasala daughter in law veena turned as dubbing artist

(Image source from: ghantasala daughter in law veena turned as dubbing artist)

తెలుగు సినిమా చరిత్రలో ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఘంటసాల గురించి తెలియనివారు ఎవ్వరు వుండరు. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు... దేశ విదేశాల్లో కూడా ఈయన ఖ్యాతి విస్తరించి వుంది. అటువంటి గొప్ప వ్యక్తి కలిగిన కుటుంబం నుంచి ఇప్పుడు ఆయన మనవరాలు వీణ తన గళాన్ని తెలుగు ప్రేక్షకులకు వినిపించబోతోంది.

ఘంటసాల తనయుడు అయిన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాగే ఆయన కుమార్తె అయిన వీణ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తూ డబ్బింగ్ ఆర్టిస్టుగా నిరూపించుకుంటోంది. ఎంబీయేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వీణ.. తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు పాటలు పాడుతూ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటుంది. గతంలో అందాల రాక్షసి సినిమాలో ఒక పాట పాడిన వీణ... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘‘హార్ట్ ఎటాక్’’ సినిమా ద్వారా డబ్బింగ్ కళాకారిణిగా ఎంట్రీ ఇచ్చుకుంది. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘‘నేనొక్కడినే’’ సినిమాలో కృతిసనోన్ కి డబ్బింగ్ చెప్పింది.

హీరోయిన్లకు తగ్గట్టుగా పర్ ఫెక్ట్ లిప్ సింక్ అయ్యేలా డబ్బింగ్ చెప్పి... అందరి గౌరవమన్ననలను పొందింది. ఈ రెండు చిత్రాల ద్వారే తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన పేరును నిలబెట్టుకుంది. దాంతో ఈమె తన జీవితాన్ని ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఘంటసాల మనవరాలిగా కాకుండా... తనను తాను నిరూపించుకుంటూ తెలుగు చిత్రసీమలో తనదైన ప్రస్థానం ఏర్పరచుకుంటోంది. ఘంటసాల కుటుంబం నుంచి వీణ కూడా ఆయనలాగే అందరి అభిమానాన్ని పొందాలని కోరుకుంటూ ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles