Colors swathi gets another tamil movie

colors swathi gets another tamil movie, vishnuvardhan of panjaa fame has signed swathi, actress swathi, atress swathi movies.

colors swathi gets another tamil movie

కలర్స్ పాపకు మరో బిగ్ ఛాన్స్

Posted: 07/08/2014 06:34 PM IST
Colors swathi gets another tamil movie

టాలీవుడ్ హీరోయిన్ అయిన కలర్స్ స్వాతి ఇక్కడి కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ స్టార్ డమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో కోలీవుడ్ పై కన్నేసి అక్కడ ఇండస్ట్రీని దున్నేస్తుంది. తెలుగులో ఒక సినిమాకు సైన్ చేస్తే కోలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతుంది.

ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడుకు మరో అవకాశం వచ్చి తలుపు తట్టింది. కోలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విష్ణు వర్థన్ త్వరలో ఆర్య, కృష్ణ హీరోలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృష్ణ సరసన స్వాతిని తీసుకున్నాడు. ఇటీవలే ఈమె ‘వడకర్రీ ’ అనే చిత్రంలో నటించింది. దీనిని ‘కుల్ఫీ ’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది.

మరోవైపు స్వాతి ‘కార్తికేయ ’ సినిమాలో నిఖిల్ సరసన నటిస్తుంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ కూడా నడుస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అమ్మడు వ్యవహారం చూస్తుంటే కోలీవుడ్ లోనే సెటిల్ అయ్యేట్లట్లు కనిపిస్తుంది. అందరు హీరోయిన్లు బాలీవుడ్ కి వెళితే స్వాతి కోలీవుడ్ కి వెళ్ళి నా దారి సెపెరేట్ అని నిరూపించుకుంటుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles