Richa chaddha refuses to work with sunny leone

Richa Chaddha refuses to work with sunny leone, richa chadha latest news, richa chadha refuses to work with sunny leone, sunny leone latest news, sunny leone hot photo shoot, sunny leone latest photo shoot, sunny leone with rich chadha, sunny leone hot photos, richa chadha hot photos, richa chadha comments on sunny leone

Richa Chaddha refuses to work with sunny leone

సన్నీలియోన్ తో కలిసి నటించడం నావల్ల కాదు!

Posted: 07/15/2014 01:26 PM IST
Richa chaddha refuses to work with sunny leone

బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ తో కలిసి నటించే అవకాశం వస్తే.. ఎవరైనా వదులుకుంటారా..? బాలీవుడ్ అగ్రకథానాయకులు కూడా ఈమెతో నటించడానికి తహతహలాడుతున్నారు. ఇక కుర్ర హీరోలయితే ఈమెతో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆవేశంతో ఉర్రూతలూగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సన్నీలియోన్ ఇమేజ్ కూడా చాలా బాగానే వుంది. ఈమె ఇప్పటివరకు నటించిన సినిమాలు కూడా అన్నీ హిట్ అయ్యాయి. పైగా ఈమెకు సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఈమెతో నటించడానికి ఏ హీరో అయినా, యాక్ట్రెస్ అయినా కనీసం పేరు సంపాదించుకోవడానికి ముందుకొస్తారు.

కానీ వీరందరికీ భిన్నంగా ఒక బాలీవుడ్ తార మాత్రం సన్నీలియోన్ తో నటించడానికి నిరాకరిస్తోంది. ఆమె కూడా సన్నీలియోన్ లాగే హాట్ హాట్ అందాలను ఆరబోయడంలో వెనుకాడదు. సినిమా ఆఫర్లు కూడా ఎక్కువేమీ లేవు. అయినా సన్నీలియోన్ లాంటి హాట్, స్టార్ హీరోయిన్ తో నటించడానికి ససెమిరా అంటోంది. ఆమె ఎవరో కాదు.. ‘‘ఓయ్ లక్కీ లక్కీ ఓయ్’’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమై, ఆ తరువాత తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ యువకులను రక్తికట్టించిన తార రిచా చడ్ఢా!

మొదటిసారిగా రిచా చఢ్డాను రాగిణి ఎంఎంఎస్-2 సినిమాలో సన్నీలియోన్ తో నటించాలని దర్శకనిర్మాతలు కోరితే... అప్పుడు వారికి సున్నితంగా నో అని సమాధానం ఇచ్చింది. రెండోసారి ‘‘టీనా అండ్ లోలో’’ సినిమాలో వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంది. ఇప్పుడు తాజాగా ‘‘మస్తీజాదే’’ సినిమాలో ఈమెను సన్నీతో నటించమని రిక్వెస్ట్ చేస్తే... ‘‘ఆమెతో నటించడం నావల్ల కాదురా బాబు’’ అంటూ సమాధానమిచ్చిందట! దీంతో సదరు దర్శకనిర్మాతలు అక్కడినుంచి సైలెంట్ గా వచ్చేశారని సమాచారం!

రిచా చఢ్డాకు వరించిన ఈ మూడు సినిమాలు శృంగార రస ప్రధాన చిత్రాలే. ఆ మూడు సినిమాల్లో ప్రధాన పాత్రను పోషించింది సన్నీలియోనే! కానీ సన్నీతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ అమ్మడు ఎందుకు వదులుకుంటోందని ప్రశ్నిస్తే.. దానికి బదులుగా ఈమె.. ‘‘నేను వదులుకున్న మూడు సినిమాల్లో సన్నీలియోన్ వుండటం కాకతాళీయం మాత్రమే కానీ.. ఆమె వున్నందువల్ల నేనీ సినిమాలు ఒప్పుకోలేదని కాదు’’ అని సంజాయిషీ ఇచ్చుకుంది. బహుశా వీరిద్దరి మధ్య గతంలో ఏవైనా విభేదాలు వచ్చినందువల్లే రిచా, సన్నీతో కలిసి నటించడానికి ఒప్పుకోవడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles