Salman khan liplock scene with jaqueline fernandez in kick

Salman khan liplock with jaqueline fernandez in kick movie goes viral in bollywood, salman khan latest news, salman khan latest movie kick news, salman khan kick movie, salman khan in kick movie, salman khan liplock with jaqueline fernandez, salman khan liplock scene in kick movie, salman khan with jaqueline fernandez, salman khan liplock scene with jaqueline fernandez, jaqueline fernandez hot photos, jaqueline fernandez hot photo shoot

Salman khan liplock with jaqueline fernandez in kick movie

‘‘లిప్ లాక్’’తో కిక్కెక్కించనున్న పెళ్లికాని ప్రసాద్!

Posted: 07/19/2014 11:08 AM IST
Salman khan liplock scene with jaqueline fernandez in kick

ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమల్లో ‘‘లిప్ లాక్’’ సన్నివేశాలు చాలా సాధారణం అయిపోయాయి. చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాలకు వరకు కనీసం ఒక్క సన్నివేశంలోనైనా చుంబనాలు చేసుకోవడం సహజంగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీ విషయం కాస్త పక్కనపెడితే... బాలీవుడ్ లో చుంబనాల్లో నెంబర్ 1 హీరోగా ఇమ్రాన్ హష్మి పేరు సంపాదించుకున్నాడు. అతనితో మొదలైన ఈ చుంబనాలు పోటీ... నేటి యువహీరోలు సైతం ఎగబడి మరీ చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలు లేకుండానే విచ్చలవిడిగా వెండితెరపై ముద్దుల్లో మునిగి తేలుతున్నారు.

అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఇటువంటి చుంబనాల సన్నివేశాల్లో నటించడానికి చాలా సిగ్గుపడతాడు. గతంలో ఈయన నటించిన ఏ సినిమాల్లోనూ తారలతో లిప్ లాక్ చేసింది లేదు. మహా అయితే బుగ్గల మీద ముద్దు పెట్టుకోవడం తప్ప. ఈయనకు తారలతో ముద్దుసన్నివేశాల్లో నటించడానికి చాలాసార్లు ఆఫర్లు వచ్చినా... సిగ్గుతో వాటిని తిరస్కరించేశాడు. సినిమాలో ఆ సీన్ ఎంత డిమాండ్ వున్నప్పటికీ... దర్శకనిర్మాతలకు రిక్వెస్ట్ చేసి మరీ వాటిని తొలగించేవాడని యూనిట్ మెంబర్లు చెబుతుంటారు.

కానీ తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘‘కిక్’’ సినిమాలో మాత్రం సిగ్గువిడిచి హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను తనివితీరా ముద్దాడేశాడని సమాచారం! ఇన్నాళ్లవరకు తన సినిమా కెరీర్ లోనే ఏ తారతోనూ ముద్దుసన్నివేశంలో  సల్మాన్ ఖాన్... ఈ ‘‘కిక్’’ సినిమాలో ఓ రేంజిలో రెచ్చిపోయాడని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. ఎన్నడూలేని విధంగా సల్మాన్ ఖాన్ ఈసారి తన అభిమానులను ఈ ముద్దు సన్నివేశంలో కిక్కెక్కిస్తాడని చెప్పుకుంటున్నారు.

అయితే జాక్విలిన్ ఫెర్నాండెజ్ కు మాత్రం ఈ ముద్దు సన్నివేశం చాలా కామనే! ఎందుకంటే.. గతంలో ఈ అమ్మడు ఇమ్రాన్ హష్మీ సరసన మర్డర్ 2 సినిమాలో చుంబనాల మీద చుంబనాలు ఇచ్చేసింది. కొన్ని ఘాటు సన్నివేశాల్లో కూడా నటించింది. దీంతో జాక్విలిన్ లాంటి అందగత్తెను చూస్తే... ఏ స్టార్ హీరో అయినా కరిగిపోవాల్సిందేనని బాలీవుడ్ లో అందరూ జోకులు వేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles