Anushka shetty comments on south industry heroes

anushka shetty comments on bollywood heroes, anushka shetty comments on south industry heroes, South film industry fans fires on actress anushka shetty, anushka shetty latest news, south industry fans fires on anushka, south industry star heroes fans fires on anushka, anushka shetty latest hot photos, anushka shetty in bahubali movie, anushka shetty bikini photo shoot, anushka shetty latest photo shoot, anushk movies list, anushka shetty filmography

South film industry fans fires on actress anushka shetty

అనుష్క మీద పడి... చిందులేస్తున్నారు!

Posted: 07/19/2014 03:23 PM IST
Anushka shetty comments on south industry heroes

టాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటిస్తున్న అనుష్కకు అనుకోకుండా చిక్కులొచ్చి పడ్డాయి. తన మనసులో వున్న మాటలను అందరితో పంచుకోవడమే ఆమె శాపంగా మారింది. ఎన్నడూలేని విధంగా కామెంట్లు చేయడం వల్ల ఈమె పెద్ద సమస్యల్లో కూరుకుపోయింది. మొన్నటివరకు అనుష్క అంటే వెంటపడే అభిమానులు... ఇప్పుడు ఆమె పేరెత్తుతేనే చిర్రెక్కిపోతున్నారని తాజా సమాచారాలు తెలుపుతున్నాయి.

ఇటీవల కోలీవుడ్ లో నిర్వహించిన ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్య్యూలో అనుష్క పాల్గొంది. ఇందులో భాగంగానే మీ అభిమాన నటులెవరు అని ప్రశ్నిస్తే... ఈ అమ్మడు అతి తెలివి ప్రదర్శించి... ‘‘నాకు అభిషేక్ బచ్చన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లు అంటే చాలా ఇష్టం’’ అంటూ సమాధానమిచ్చింది. ఇక అంతే సంగతులు! కేవలం తనకు నచ్చిన హీరోల పేర్లను అందరితో చెప్పుకోవడమే అవి ఆమె మెడకు చుట్టుకున్నాయి.

ఒకవైపు టాలీవుడ్ - కోలీవుడ్ లలో సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్న అనుష్క... ఇంతవరకు సినిమాలు తీయని బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పడంతో సౌత్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ విషయంపై సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు చెందిన అభిమానులు ఫేస్ బుక్, ట్విటర్ లలో అనుష్కపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సౌత్ లో వున్న టాప్ హీరోల సరసన్ హీరోయిన్ గా నటించడం వల్లే ఆమెకు మంచి గుర్తింపు లభించిందని, ఈ విషయాన్ని మరిచి బాలీవుడ్ హీరోల పేర్లను ఎందుకు తీసుకుందని ఆమెపై విరుచుకుపడ్డారు. ‘‘బాలీవుడ్ హీరోలు అంతగా ఇష్టం వున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు ఎందుకు తీస్తున్నావు..? ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ ఆమెపై మండిపడ్డారు.

మరి ఇటువంటి పరిస్థితుల నుంచి అనుష్క ఎలా బయటపడుతుందో...? అభిమానులకు ఎటువంటి సమాధానమిస్తుందో...? అని ప్రతిఒక్కరి మదిలో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కూడా హీరోయిన్ త్రిష తన అభిమాన హీరో పేరు చెప్పి, కోలీవుడ్ అభిమానుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కున్న విషయం తెలిసిందే! ఆ సమస్య నుంచి త్రిష ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు అనుష్క సమాధానం కోసం ప్రతిఒక్కరు వెయిట్ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles