Trisha to wear bikini in kannada power movie

trisha to wear bikini in kannada power movie, trisha in bikini, trisha in kannada power movie, trisha with puneeth rajkumar, trisha hot photos, trisha hot photo shoot, trisha in kannada movie power, trisha latest hot stills, trisha in sarry, trisha latest news, actress trisha news, actress trisha hot photos

trisha to wear bikini in kannada power movie which is remake to telugu dookudu movie

‘‘పవర్’’ స్టార్ కోసం బికినీ వేయనున్న త్రిష!

Posted: 07/23/2014 11:54 AM IST
Trisha to wear bikini in kannada power movie

ఒకప్పుడు టాలీవుడ్ లో తన యాక్టింగ్ స్కిల్స్, అందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన త్రిష... కొత్త హీరోయిన్ల రాకతో అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడప్పుడు పెద్ద హీరోలతో వచ్చిన సినిమా ఆపర్లను కూడా.. ‘‘నేనింకా లైమ్ టైమ్ లోనే వున్నానంటూ’’ వాటిని తిరస్కరించి మరీ ఇబ్బందుల్లో పడింది. దీంతో త్రిష కెరీర్ ఇక ముగిసినట్టేనని అందరూ భావించారు. అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ... అదృష్టం మాత్రం ఈమెను వరించలేదు. చివరికీ తన గ్లామర్ డోస్ ను పెంచుకుని, బికినీ వేసుకోవడానికి సిద్ధమని చెప్పినా... దర్శకనిర్మాతలు మాత్రం ఈమెవైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కనీసం చిన్న సినిమాల్లోనైనా అవకాశాలు వరించవా అనే ఆశతో ఇంతవరకు ఎదురుచూస్తూనే వుంది.

అయితే ఇప్పుడు తాజాగా ఈమెకు ఒక భారీ అదృష్టం కలిసొచ్చింది. తెలుగులో మహేష్ బాబు నటించిన ‘‘దూకుడు’’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరకీ తెలిసిందే! ఈ సినిమాను కన్నడలో ‘‘పవర్’’గా రీమేక్ చేస్తున్న విషయం కూడా విదితమే! ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ కన్నడ రీమేక్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మహేష్ పాత్రను పోషించగా.. గ్లామర్ డాల్ సమంత పాత్రను త్రిష పోషించనుంది. అయితే ఆ మూవీ యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం... తెలుగులో సమంత అందించిన అందాల కంటే... కన్నడలో త్రిష మరింత ఎక్కువగా ప్రదర్శించిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం త్రిష కెరీర్ డౌన్ ఫాల్ లో వుండటం కారణంగా... వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనే నెపంతో ఈ సినిమాలో త్రిష ఏకంగా బికినీ వేసుకుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. బికినీ టాప్ మీద గాజుగుడ్డలను ధరించి, తన ఒంపుసొంపులను కన్నడ ప్రేక్షకులను కనువిందు చేయనుందని, దాదాపు తన శరీర అందాలను విపరీతంగా ప్రదర్శించిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాకరాక వచ్చిన అవకాశంతోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు త్రిష ఈవిధంగా అందాల ప్రదర్శన చేస్తోందని ఇండిస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఒకవేళ ఈ సినిమా కూడా దూకుడులాగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే... త్రిషకు కన్నడలో వరుసగా అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎలాగూ అవకాశాలు రావడం లేదు కాబట్టి.. కనీసం కన్నడలోనైనా సినిమా అవకాశాలను రప్పించుకోవాలనే ప్లాన్ తోనే త్రిష బికినీ వేసుకుందని న్యూస్! గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అందాలను ప్రదర్శిస్తున్న త్రిషకు... ఈ సినిమా అయినా కనుకరిస్తుందో లేదో  వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles