Amitabh bachchan sponsor the shooters

Amitabh Bachchan to sponsor training of shooters Ayonika Paul and Pooja Ghatkar, amitabh bachchan latest news, amitabh bachchan sponsor the shooters, amitabh bachchan news, amitabh bachchan financial supports to women, amitabh bachchan in sports, models for india programme, olympic gold quest ngo company, olympic games, olympic players in india

Superstar Amitabh Bachchan to sponsor training of shooters Ayonika Paul and Pooja Ghatkar, amitabh bachchan latest news

రాజువయ్యా.. మహారాజువయ్యా!

Posted: 07/24/2014 01:38 PM IST
Amitabh bachchan sponsor the shooters

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏవిధంగా అయితే తన ప్రస్థానాన్ని బాలీవుడ్ లో స్థిరపరుచుకున్నాడో... అంతే దయామయుడని చిత్రపరిశ్రమలో వున్న ప్రముఖులు పేర్కొంటుంటారు. అమితాబ్ ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ... అందరితోనూ ఒక సాధారణ వ్యక్తిగా కలిసిపోతాడని, కష్టాల్లో వున్నవారిని ఆదుకుంటారని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళా క్రీడాకారులకు అమితాబ్ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నాడని తాజా సమాచారం!

Ayonika-Paul

‘‘ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్’’ అనే ప్రముఖ ఎన్జీవో సంస్థ 2016 రియో ఒలంపిక్స్ లో మన భారతదేశానికి ఎక్కువ పతకాలను అందించేందుకు ‘‘మోడల్స్ ఫర్ ఇండియా’’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ సంస్థ దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టి, ఒలంపిక్స్ లో పతకాలను గెలుచుకోగల సత్తా వున్న క్రీడాకారులను గుర్తిస్తుంది. వారికి తగిన విధంగా శిక్షణను కల్పిస్తూ, ప్రోత్సాహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ షూటింగ్ లో రాణిస్తున్న అయోనికా పాల్, పూజా ఘట్కర్ అనే ఇద్దరు యువక్రీడాకారిణులను ఎంపిక చేసింది.

Pooja-Ghatkar

అయితే ఆర్థికపరంగా ఆ ఇద్దరు క్రీడాకారిణులు వెనుకబడి వున్నారని తెలుసుకున్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్... వారికి ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారి శిక్షణతోపాటు ఇతర అవసరాలకు అయ్యే ఖర్చునంతటినీ ఇకనుంచి అమితాబ్ భరించనున్నారు. అబ్బాయిలకంటే అమ్మాయిలు తక్కువేమీ కాదని.. వారు కూడా పోటీల్లో తమ సత్తాతో గెలుచుకుని వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన అమితాబ్... ‘‘మోడల్స్ ఫర్ ఇండియా’’ కార్యక్రమం ద్వారా వీరిద్దరికయ్యే ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles