Kajal agarwal slam the rumours about her remuneration in mumbai interview

kajal agarwal, kajal agarwal latest news, kajal agarwal remuneration, kajal agarwal hindi movies, kajal agarwal remuneration, kajal agarwal bollywood movie, kajal agarwal pehle aap janab movie, kajal agarwal hot photo shoot

kajal agarwal slam the rumours about her remuneration in mumbai interview : Tollywood top heroine kajal agarwal slam the rumours about her remuneration in mumbai interview. she got a new bollywood officer in which she is acting in lead role in nagative shades.

నేనలా చేయలేదు.. నా మాట నమ్మండి! కాజల్

Posted: 08/12/2014 10:39 AM IST
Kajal agarwal slam the rumours about her remuneration in mumbai interview

సినిమా ఇండస్ట్రీలో వున్న చిన్నస్థాయి తారల నుంచి టాప్ హీరోయిన్లదాకా రకరకాల గాసిప్ లు రావడం సర్వసాధారణం! ముఖ్యంగా టాప్ హీరోయిన్లకు సంబంధించినవి అయితే అవి కొన్నాళ్లవరకు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతాయి. అవి వారి వ్యక్తిగత విషయాలకుగానీ, డ్రెస్సింగ్ స్టైక్ కు గానీ, పారితోషికం తీసుకోవడంలో గానీ, గ్లామర్ డోస్ కు తదితర రకరకాల అంశాలకు సంబంధించి ఎన్నోరకాల రూమర్లు వస్తూనే వుంటాయి. అందులో కొన్ని నిజమైతే.. మరికొన్నింటిని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సందరు హీరోయిన్లు తోసిపుచ్చుతారు. మిగతా చిత్రపరిశ్రమల్లో వున్న తారల సంగతి అలా వుంచితే.. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ కు సంబంధించి రోజుకో రూమర్ టాలీవుడ్ చిత్రపరిశ్రమలో, మీడియా వార్తల్లో షికార్లు చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్ తన రెమ్యునరేషన్ ను చాలా భారీగా పెంచేసేందని, అందువల్లే వచ్చిన సినిమా అవకాశాలను పెండింగ్ లో పెట్టేసి దర్శకనిర్మాలతోసహా హీరోల సహన పరీక్ష తీసుకుంటోందని వార్తలు తెగ జోరందుకుంటున్నాయి. గతంలోకంటే ఈసారి చాలా ఎక్కువగా పెంచేసిందని.. కోటి నుంచి ఏకంగా రెండుకోట్లకు పారితోషికాన్ని పెంచేసిందని చిత్రసీమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు మీద సినీ ప్రముఖుల నుంచి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. ‘‘ఎంత టాప్ హీరోయిన్ అయితే మాత్రం.. మరీ ఇంతగా రెమ్యునరేషన్ ని పెంచేయాలా’’ అంటూ ప్రతిఒక్కరు ఈమె మీద కసురుకుంటున్నారు.

అయితే ఈ వార్తలు చక్కర్లు కొడుతూ కొడుతూ చివరకు కాజల్ అగర్వాల్ కు దగ్గరకు చేరిపోయింది. దీంతో ఈ అమ్మడు తనపై వస్తున్న ఈ వార్తలపై మండిపడుతూ తీవ్రంగా ఖండిస్తోంది. ‘‘నామీద అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు’’ అంటూ గొంతు చించుకుని మరీ కేకలు పెడుతోంది. ఈ నేపథ్యంలో కాజల్ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పట్నుంచి ఉన్నదాంట్లోనే సంతృప్తి పడటం అలవాటు! అంతేకానీ నా డిక్షనరీలో ‘‘అత్యాశ’’ అనే పదమే లేదు. అలా అత్యాశకు లోనయ్యేవారిని చూస్తేనే నాకు అసహ్యం. అటువంటి నేనెలా అత్యాశకు గురవుతాను’’ అంటూ తనపై వస్తున్న రూమర్స్ ను ఖండిస్తూ తీవ్రంగా బదులిచ్చింది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ మిశ్రా తెరకెక్కిస్తున్న ‘‘పెహెల ఆప్ జనాబ్’’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అగర్వాల్.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘నా పారితోషికం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వింటుంటే నాకే విచిత్రంగా వుంది. దయచేసి అటువంటి గాసిప్ లను నమ్మొద్దు’’ అంటూ మొరపెట్టుకుంది. ‘‘సినిమాలో నా పాత్రకు తగ్గట్టు వున్న పనిని బట్టే పారోతోషికాన్ని తీసుకుంటాను. ఒక్కోసారి గ్లామర్ కే పరిమితమయ్యే పాత్రలు చేయాల్సి వస్తుంది. ఆ పాత్ర చేయడంలో నాకు ఎటువంటి సమస్య లేదు కానీ.. సదరు పాత్రకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తుంటాయి. అది నిజం కాదు. నేను నా కష్టానికి మించి పారితోషికం తీసుకోను. నేను అందరిలాగే అత్యాశకు పోను’’ అని కాజల్ పేర్కొంది.

ఇందులో భాగంగానే కాజల్ మాట్లాడుతూ.. ‘‘నేను సౌకర్యవంతమైన సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. ఇది నాకు ముందునుంచే అలవాటు. అంతేకానీ ఏదో పెద్ద సంస్థ నిర్మిస్తోంది కదా.. పెద్ద హీరో నటిస్తున్నాడు కదా అని అటువంటి సినిమాలకు సైన్ చేయను. ఏదైనా సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత వుండి, సౌకర్యంగా వుంటేనే ‘ఓకే’ చేస్తాను. ప్రస్తుతం నేను నటిస్తున్న హిందీ సినిమాలో పాత్ర ఎంతో కీలకమైంది. జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్న అమాయకురాలి జీవితంలోకి అనూహ్యమైన పరిణామాలు వస్తాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితేంటి? అనే కథాంశంతో సాగుతోంది. దర్శకుడు సుధీర్ మిశ్రా నాకు ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. నేను నటిగా నిరూపించుకునే అరుదైన అవకాశం ఇది. ఇందులో నా పాత్రలో అంతర్లీనంగా నెగెటివ్ షేడ్స్ వుంటాయి’’ అని తన తాజా చిత్రం గురించి వివరించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles