Shilpi sharma got item song offer in current theega movie

manchu manoj, current theega movie, shilpi sharma latest news, shilpi sharma item songs, shilpi sharma bikini photos, shilpi sharma hot photo shoot, shilpi sharma manchu manoj, shilpi sharma current theega movie

shilpi sharma got item song offer in current theega movie : the bikini babe shilpi sharma got item song offer in manchu manoj latest film current theega

‘‘కరెంట్ తీగ’’తో షాకివ్వనున్న బికినీ భామ!

Posted: 08/25/2014 12:53 PM IST
Shilpi sharma got item song offer in current theega movie

‘‘గ్రీన్ సిగ్నల్’’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన శిల్పి శర్మ.. ఆ సినిమాలో బికినీ వేసుకుని ప్రేక్షకులను మత్తెక్కించేసింది. దాదాపు తనలో వున్న గ్లామర్ అందాలను అందులో ఒలకబేసేసి.. సినీ ప్రముఖులను సైతం ఈ అమ్మడు తన బుట్టలో వేసేసుకుంది. ఈ బికినీ భామకు ఆ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు కానీ... తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని మాత్రం క్రియేట్ చేసుకుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చుకున్న హీరోయిన్లు ఎంత అందాలను ఒలకబోసినా అంతగా పేరు సంపాదించుకోలేరు కానీ ఈ అమ్మడు మాత్రం అప్పుడప్పుడు కరెంట్ తీగలా షాక్ కొడుతూ వుంటుంది. ఇప్పుడు తాజగా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను మరోసారి కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

‘‘పోటుగాడు’’ సినిమాతో సక్సెస్ రూట్ లోకి వచ్చిన మంచు మనోజ్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘‘కరెంట్ తీగ’’తో తిరిగి వస్తున్న విషయం తెలిసిందే! మొన్నటికి మొన్న షూటింగ్ ను ప్రారంభించుకున్న ఈ సినిమా.. అప్పుడే చివరి దశకు వచ్చేసిందని ఆ మూవీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేశారు. ఇందులో మనోజ్ రిస్కీ స్టంట్స్ తో ప్రేక్షకులను అలరించడంతోపాటు... శిల్పి శర్మ తన అందాలను హోయలొలికిస్తూ ఐటెం సాంగుతో ఆకట్టుకుంటుందని తాజా సమాచారం! బికినీతో తెలుగు యువత మతిని పోగొట్టిన ఈ అమ్మడు.. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కు సరిగ్గా సరిపోతుందనే నిర్ణయానికి వచ్చిన అనంతరం తీసుకున్నట్టు చిత్రం యూనిట్ అంటోంది. ఈ స్పెషల్ సాంగ్ లో శిల్పి శర్మ తన హాట్ అందాలతో మాస్ ఆడియెన్స్ కు ట్రీట్ ఇవ్వడం ఖాయమని టీం మెంబర్లు చెబుతున్నారు. పైగా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కూడా అదిరిపోయే మాస్ బీట్ ను ఈ సాంగ్ కోసం కంపోజ్ చేశాడని ఇండస్ట్రీలో టాక్!

ఏదిఏమైనా.. తనకు సినిమాల్లో ఆఫర్ రాకపోయినా ‘‘కరెంట్ తీగ’’లాంటి భారీ సినిమాలో తనకు ఐటమ్ సాంగ్ లభించడంతో సంతోషంలో మునిగి తేలుతోంది. దీంతో ఈమె కెరీర్ తెలుగు చిత్రపరిశ్రమలో పదిలం అయిపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తుండగా... హాట్ బ్యూటీ సన్నీలియోన అతిథి పాత్రలో కనిపించనుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మూవీని కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpi sharma  manchu manoj  sunny leone  rakul preet singh  current theega movie  

Other Articles