Neetu chandra item song in kannada power movie

power star movie, kannada power movie, kannada power star movie, neetu chandra, neetu chandra hot photo shoot, neetu chandra item song, neetu chandra sex appeal, neetu chandra hot scenes, neetu chandra bikini

neetu chandra item song in kannada power movie : the bengali actress neetu chandra getting more kannada movie offers by doing item song in power movie

పవర్ స్టార్ తో దున్నేసింది... ఆఫర్లు పట్టేసింది!

Posted: 09/01/2014 06:46 PM IST
Neetu chandra item song in kannada power movie

(Image source from: neetu chandra item song in kannada power movie)

నీతూచంద్ర అనే అమ్మాయి ఎవరికైనా గుర్తుందా..? అదేనండి... శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘‘గోదావరి’’ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా లంగోవోణీల్లో కనువిందు చేసింది కదా.. ఆ బీహార్ బ్యూటీయే నీతూచంద్ర! ఆ సినిమా తర్వాత వెంటనే ఈ అమ్మడు కోలీవుడ్ కి చెక్కేసి... మరిన్ని మూవీ ఆఫర్లకోసం తనలో వున్న అందచందాలన్నీ భారీగా చూపించేసింది. అవకాశం వచ్చినప్పుడల్లా పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని ప్రేక్షకులను, దర్శకనిర్మాతలను ఆకర్షించుకోవడానికి బాగానే ట్రై చేసింది. కానీ అక్కడ కూడా నీతూకు అవకాశాలు రాలేదు. ఏదో టాలీవుడ్ పుణ్యమా అని రాకరాక రాజశేఖర్ తో కలిసి నటించే అవకాశం వస్తే... ఆ తర్వాత అసలు అడ్రస్ లేకుండా పోయింది. కానీ అక్కినేనివారు చేరదీసుకోవడంతో ‘‘మనం’’ సినిమాలో ఒక చిన్న సీన్ లో మెరుపుతీగలా మెరిసి, వెళ్లిపోయింది. అంతకుమించి టాలీవుడ్ లో మరే ఆఫర్లు రాలేదు.

ఇక బాలీవుడ్ కి మకాం మార్చితే అక్కడున్న స్టార్ హీరోయిన్ల దెబ్బకు వెనక్కు రావాల్సి వచ్చేసింది. దీంతో ఖాళీగా సమయం గడుపుతున్న ఈ అమ్మడిని పవర్ స్టార్ ఒక ఆఫర్ ఇచ్చాడు. తనతో కలిసి ఐటమ్ సాంగ్ నటించాల్సిందిగా ఆమెను కోరితే ఒక్కక్షణం ఆలోచించకుండా అందుకు ఓకే చెప్పేసింది. అంతే! నీతూ చేతికి బంపరాఫర్ తగిలినట్టయ్యింది. అతనితో కలిసి పోటీగా స్టెప్పులేయడమే కాకుండా... తన భారీ అందాలతో కూడిన సెక్స్ అప్పీల్ తో ప్రేక్షక జనాలను పిచ్చెక్కించి పారేసింది. దీంతో ఈ అమ్మడు చేసిన హోయలు అందరికీ తెగ నచ్చేశాయట! ఎక్కడ చూసినా నీతూ గురించే చర్చలు కొనసాగుతున్నాయని భారీగా ప్రచారాలు సాగుతున్నాయి. దీంతో ఈ అమ్మడికి బోలెడన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయని సినీవిశ్లేషకులతోపాటు ఆమె కూడా మురిసిపోతోంది! అయితే ఈ అమ్మడికి ఇంత క్రేజ్ రావడానికి కారణం పవర్ స్టారేనని, అందుకు తాను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని పేర్కొంటోంది.

మరి ఇక్కడ పవర్ స్టార్ అంటే మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదులెండి... కన్నడ చిత్రపరిశ్రమలో పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్! ఈ హీరో తాజాగా మహేష్ బాబు ‘‘దూకుడు’’ సినిమాను కన్నడలో ‘‘పవర్’’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే! తెలుగు దూకుడులో మహేష్ బాబు సరసన పార్వతి మెల్టన్ పూవాయ్ పూవాయ్ అంటూ ఆడిపాడిన విషయం విదితమే! ఇక దూకుడు కన్నడ పవర్ లో ఆమె స్థానంలో నీతూ చంద్రను తీసుకున్నారు. రాకరాక వచ్చిన ఈ ఐటమ్ అవకాశాన్ని ఈ అమ్మడు పూర్తిగా వినియోగించేసుకుంది. తన భారీ అందాలను ప్రదర్శించడంతోపాటు పునీత్ రాజ్ తో పోటీపడుతూ స్టెప్పులు అదరగొట్టేసింది. దీంతో కన్నడ దర్శకనిర్మాతలు ఈమెపై కన్నేశారని అక్కడి ఫిల్మ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే వాళ్లు నీతూచంద్రను హీరోయిన్ గా తీసుకుంటారో లేక ఐటెంసాంగులకే పరిమితం చేస్తారోనన్న విషయాలు మాత్రం ఇంకా స్పస్టం కాలేదు. అయితే నీతూ మాత్రం దేనికైనా రెడీ అంటూ సిద్ధంగా వుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : neetu chandra  kannada power movie  puneeth rajkumar  kannada movies  

Other Articles