Pawan kalyan birthday celebrations mega heroes movies trailers

pawan kalyan, sai dharam tej, pawan kalyan latest news, pawan kalyan sai dharam tej, sai dharam tej latest movie, varun sandesh mukunda movie

pawan kalyan birthday celebrations mega heroes movies trailers : sai dharam tej and varun sandesh released their movie first look teasers on pawan kalyan birthday celebrations

పవన్ జన్మదిన సందర్భంగా అదిరిపోయిన మెగాహీరోలు!

Posted: 09/02/2014 12:50 PM IST
Pawan kalyan birthday celebrations mega heroes movies trailers

(Image source from: pawan kalyan birthday celebrations mega heroes movies trailers)

తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకుని, సరికొత్త సంచలనాల రికార్డులకు మారుపేరుగా నిలిచిపోయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు! కేవలం సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతోమంది అభిమానులను కూడబెట్టుకున్నారు. ఈయనకు సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే చాలు.. దానిని అభిమానులు సంబంరంగా జరుపుకుంటారు. ఇక జన్మదిన వేడుకలంటారా.. అది వారికి లభించిన వరంలా భావించి దానిని ఒక పెద్ద పండుగలా నిర్వహించేసుకుంటారు. అదీ పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ అంటే! ఈయనకున్న ఈ ఫాలోయింగ్ ను ఇప్పుడు మెగాహీరోలు వాడుకోవాలనే ప్రయత్నంలో మునిగిపోయారు. పవన్ జన్మదిన సందర్భంగా వరుణ్ సందేశ్, సాయిధరమ్ తేజ్ లు తమతమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేసుకున్నారు. పవన్ స్టార్ ఇమేజ్ తో వీరిద్దరూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతోపాటు అభిమానులకు కానుకగా టీజర్లను రిలీజ్ చేసి ఆనందపరిచారు.

pilla-nuvvu-leni-jeevitham

సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘‘పిల్లా నువ్వులేని జీవితం’’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాతలు బన్నీవాసు, హర్షిత్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇప్పుడు తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

mukunda-movie

మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ‘‘ముకుంద’’ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే! ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా పవన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ టీజర్ ని విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ ఈ టీజర్ లో ముకుందలా కనిపించాడు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ సంస్థవారు సుమారు 45 లక్షలకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  sai dharam tej  varun sandesh  mega heroes  

Other Articles