Anushka gets first position in earning highest money than samantha in survey

anushka shetty, samantha, samantha latest news, anushka shetty latest news, anushka shetty hot photo shoot, anushka shetty photo gallery, anushka shetty samantha, samantha with anushka shetty, kollywood survey

anushka gets first position in earning highest money than samantha in survey

సమంతకు చుక్కులు చూపించిన అనుష్క!

Posted: 09/04/2014 03:09 PM IST
Anushka gets first position in earning highest money than samantha in survey

(Image source from: anushka gets first position in earning highest money than samantha in survey)

సాధారణంగా చిత్రపరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడు కొన్ని వివాదాస్పదమైన సంఘటనలు తెరమీదకు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా హీరోలకంటే హీరోయిన్లదే ఈమధ్యకాలంలో మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా అనుష్క, సమంతకు సంబంధించిన ఒక కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ బొమ్మాళీ అనుష్క ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో నెబర్ వన్ స్థానాన్ని కైవలం చేసుకున్న గ్లామర్ డాల్ సమంతకు చుక్కలు చూపించిందని సమాచారం! అయితే ఇది వీరి వ్యక్తిగతంగా సంబంధించిన వివాదం అయితే కాదులెండి! తమిళనాడులోని ఒక పత్రిక నిర్వహించిన సర్వేలో అనుష్క ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకోగా, సమంత ద్వితీయ స్థానంలో వచ్చిందని తెలిసింది. అయితే అది ఏ విషయంలో అనుకుంటున్నారా..? అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు పారితోసికం తీసుకుంటూ హీరోలకు ధీటుగానే నిలబడుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు సైడ్ ఇన్ కమ్ బాగానే దండుకుంటున్నారు. ఇక్కడ సైడ్ ఇన్ కమ్ అంటే.. ఏదైనా కంపెనీగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమో.. కొత్తకొత్త షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు వెళ్లడం, యాడ్స్ వంటి కార్యక్రమాల ద్వారా భారీగానే డబ్బులను పొగేసుకుంటున్నారు. హీరోలకంటే ఎక్కువగా తీరిక సమయం లేకుండా బొద్దుగుమ్మలే ఎక్కువగా సంపాదిస్తున్నారని తేలింది. ఇందులో భాగంగానే ఎవరు ఎక్కువ డబ్బులను సంపాదించుకుంటున్నారంటూ కోలీవుడ్ లోని ఓ పత్రిక సర్వే జరిపింది. సర్వే అనంతరం వెలువడిన ఫలితాలను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇందులో అనుష్క శెట్టి ప్రథమ స్థానంలో నిలవగా.. సమంత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు వెలువడింది.

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గత రెండేళ్ల నుంచి వరుస విజయాలను అందుకోవడంతోపాటు ప్రస్తుతం ఏడు సినిమాలతో బిజీగా వుంది. అలాగే తీరిక సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక యాడ్ లో దర్శనమిస్తూనే వుంటుంది. ఈ లెక్కన అమ్మడు ఎక్కువ డబ్బులనే దండేసుకుని వుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తే.. సర్వేలో కూడా మొదటి స్థానం ఆమెదేనని ఫిక్స్ అయిపోయారు. కానీ ఫలితాలను చూసిన అనంతరం అందరూ నివ్వెరపోయారు. అనుష్క సినిమాల్లో కనిపించక సంవత్సరంపైనే గడిచింది. అలాగే అరకొర యాడ్ లలో మాత్రమే కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ అమ్మడు వివిధ మార్గాల ద్వారా ఈ ఏడాది మొత్తం 15 కోట్లు సంపాదించిందని సర్వే గణాంకాలు తేల్చేశాయి. దీంతో బొమ్మాళీ మరోసారి తన సత్తాను చాటుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  anushka shetty  kollywood survey  tollywood  

Other Articles