Deepika padukone supports shweta basu prasad prostitution

deepika padukone, deepika padukone latest news, deepika padukone shweta basu prasad, deepika padukone prostitution, deepika padukone hot photo shoot, deepika padukone latest interview, deepika padukone, shweta basu prasad, shweta basu prasad prostitution

deepika padukone supports shweta basu prasad prostitution

శ్వేత వ్యభిచారం చేయడంలో తప్పు లేదు! ఎందుకంటే..?

Posted: 09/13/2014 01:13 PM IST
Deepika padukone supports shweta basu prasad prostitution

ఇటీవలే వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన శ్వేతబసు ప్రసాద్ విషయంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకున్న సెలబ్రిటీలందరూ తమతమ వాదనలను వినిపిస్తున్నారు. ఇందులో కొంతమంది శ్వేత తీసుకున్న నిర్ణయం చాలా తప్పని, సినిమాలు లేకపోతే సీరియళ్లు లేదా ఆర్టిస్టులుగా పనిచేయాలిగానీ ఇలా వ్యభిచారంలో దిగాల్సిన అవసరం లేదు.. పైగా కుటుంబ ఆర్థిక సమస్యలవల్లే ఇలా రొంపిలోకి దిగానని సమర్థించుకోవడం అర్థరహితమని కొట్టిపారేశారు. ఇటువంటివారి వల్ల ఇతర తారలకు చెడ్డ పేరోస్తుందని ఆమె మీద రకరకాలుగా ఆరోపణలు చేశారు. కానీ మరికొందరు తారలు మాత్రం ఈమెకు మద్దతు పలికారు. కుటుంబం కోసమే తాను వ్యభిచారంలోకి వచ్చిందన్న మాటకు వత్తాసు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకునే కూడా తనదైన శైలిలో స్పందించింది.

‘‘తన కుటుంబాన్ని పోషించుకోవడానికే వ్యభిచారంలోకి అడుగులు పెట్టానన్న శ్వేత... తనకు అదొక్కటే మార్గం అని భావించినట్లయితే అందులో తప్పేముంది..?’’ అంటూ అందరిని ఆలోచించేలా చేసేసింది. తన కుటుంబం తీవ్రంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన సందర్భంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఇతర మార్గాలు లభించకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుని వుంటుందని.. ఇలా చేయడంలో ఎటువంటి తప్పు లేదంటూ దీపిక తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘శ్వేత బసు సెక్స్ స్కాండల్’’ అంటూ మాట్లాడటం అర్థరహితమని, తన పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలంటూ కోరింది. ఇటువంటి కష్టసమయాల్లో శ్వేతకు సమాయం చేయాల్సిందిపోయి.. మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం చాలా విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలావుండగా.. ఒకవైపు బాలీవుడ్ లో పోర్న్ తారలు, ఇతర హాట్ భామలు తమ మొత్తం గ్లామర్ ను చూపిస్తూ జీవితం కొనసాగిస్తున్న తరుణంలో వ్యభిచారంలో పట్టుబడ్డ శ్వేత గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వ్యభిచారంలో పట్టుబడ్డ ఆమెను ఆదుకోవాల్సిందిపోయి తన మానం, మర్యాదలు మంటగలిసేలా ఇంత సంచలనం సృష్టించడం అసలు భారతీయ సంస్కృతీయేనా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్వేత విషయంప రాణి ముఖర్జీని వివరణ కోరగా.. ఆమె ఈ వ్యవహారంలో ఏమీ స్పందించలేనని వెళ్లిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles