Srinu vaitla taking credit of writers

srinu vaitla, srinu vaitla movies, srinu vaitla latest, srinu vaitla wiki, srinu vaitla family, srinu vaitla new writers, kona venkat, latest news, tollywood, aagadu, aagadu movie, aagadu review, aagadu latest news, aagadu mahesh babu stills, aagadu songs, aagadu rating, aagadu collections, tollywood, movie news

srinu vaitla taking credit of writers by showing title names as story, screen play, and dialogues direction by sreenu vaitla : writers of sreenu vaitla going to fire on directors attitude of using their name and credit

కొత్తవారినీ దోచుకున్నాడు.. ఏంచేస్తారో మరి ?

Posted: 09/20/2014 01:22 PM IST
Srinu vaitla taking credit of writers

తెరపై కన్పించేందుకు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. హీరోలు హీరోయిజం చూయించటానికి చాలా కష్టపడతారు. డైరెక్టర్ ఎంత చేసినా పైకి రాడు.. తెరపైకి కన్పించడు అని అందరూ బాదపడుతుంటారు. కానీ శ్రీనువైట్ల మాత్రం అలా కాదు. తాను కన్పించకపోయినా.. తన పేరు మాత్రం పెద్దగా కన్పించేట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇది ఆయన వ్యక్తిగతం కాని తనకు సంబంధంలేని విభాగాలను.., ఇతరులు కష్టపడి చేసిన పనిని తన క్రెడిట్ లో వేసుకోవటం ఎవరూ అంగీకరించరు. ఈ దోపిడి నచ్చకే కోన వెంకట్ ఓ దండం పెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్తవారు వచ్చినా..ఆగడులో సేమ్ సీన్ రిపీట్ అయింది.

కోన వెళ్ళాక శ్రీనువైట్ల టీం లోకి అనిల్, ప్రవీణ్, ఉపేంద్ర మాధవ్ అనే యువ రచయితలను తీసుకున్నారు. పంచ్, ప్రాస బాగా రాస్తున్నారని పరీక్షించి మరి పక్కన బెట్టుకున్నారు. ఇక వీరు ఆగడులో రాసిన డైలాగులు చాలాచోట్ల పేలాయి. కొన్నిచోట్ల సీన్ సెట్ కాక.. కధను పట్టుకోలేకపోవటం వల్ల అలా పడిపోయాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.., సినిమా పేర్లు పడిన సమయంలో మీరు గమనిస్తే.. కధ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శ్రీనువైట్ల అని వస్తుంది. అంటే ఆగడుకు ఆయనే డైలాగులు రాశాడన్నమాట. మరి వీరు ముగ్గురు చేసిందేమిటి అనుకుంటే అక్కడే మరో టైటిల్ పడుతుంది. అదేమంటే.., రచన అని ఉపేంద్ర, అనిల్ కు రచన సహకారం అని ప్రవీణ్ కు పేర్లు కేటాయించారు. ఇప్పుడు ఎవరు డైలాగులు రాసినట్లు వైట్లకే తెలియాలి.

ఇలా తన మేధోశక్తికి.. మాటలకు శ్రీనివాసుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడనే కారణం వల్లనే కోన కానరాకుండా పోయాడు. ఇప్పడు వీరు ముగ్గురు తొలి ప్రాజెక్టు కాబట్టి ఊరుకున్నారు. తర్వాత కూడా క్రెడిట్ గోస్ టూ... ని అంగీకరిస్తారా? అనేది ఇంకా తెలియదు. అప్పట్లో నిజం పర్యాయపదంతో వచ్చిన ఓ సినిమాలో హీరో పాటలు రాస్తే.., దాన్ని అందులోని ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుని తన పేరు వేసుకునేవాడు. ఇప్పుడిదే శ్రీనువైట్ల విషయంలో జరుగుతోంది. మరి ఆ సినిమా చివర్లో జరిగినట్లే.., నిజం బయటకు వస్తుందా.. లేక ఎప్పట్లాగే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srinu vaitla  latest news  aagadu  writers  

Other Articles