Ram gopal varma reveals his suquence secrets

ram gopal varma, ram gopal varma movies, ram gopal varma latest, ram gopal varma wiki, ram gopal varma family, ram gopal varma latest updates, ram gopal varma ice cream movie, ice cream 2 movie, ice cream movie songs free download, tollywood, latest news

ram gopal varma says he is doing movies with only 4lakhs rupees expense and earning 2crores : ram gopal varma giving shares to different departments in his movie so he is making with only rupees 4lakhs expense only

అమ్మ దానిమ్మ వర్మ... సీక్వెన్స్ సినిమాల సీక్రెట్ ఇదా..

Posted: 09/24/2014 09:58 AM IST
Ram gopal varma reveals his suquence secrets

రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులను భయపెట్టే డైరెక్టర్ గా అందిరికి తెలుసు. ఒక సినిమా ఫ్లాప్ అయినా.. దానికి సీక్వెన్స్ తీయటం అంటే వర్మకే సాధ్యం. ఐస్ క్రీం2 సినిమాను చూస్తేనే ఇది అర్ధం అవుతోంది. అయితే ఈ సినిమా సీక్వెన్స్ తీయటం వెనక ఉన్న సీక్రెట్స్ బయటకు తెలిసింది. వర్మ సినిమా కోసం కేవలం లక్షలు ఖర్చు పెట్టి.., కోట్లు పోగేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాకు అయ్యే ఖర్చు కేవలం నాలుగు లక్షల రూపాయలేనని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. నాలుగు లక్షలతో హీరో, హీరోయిన్లు కూడా దొరకరు కదా.., సినిమా మొత్తం ఎలా జరుగుతోంది అంటే వర్మ సీక్రెట్ వారు బయటకు చెప్పేశారు.

పనిచేయి.. వాటా పంచుకో

మామూలుగా సినిమా పరిశ్రమలో.. నిర్మాత ఖర్చు అంతా భరిస్తాడు. అంటే హీరో, హీరోయిన్లు, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ప్రతి పనికి పైసలు ఖర్చుపెట్టేది నిర్మాతే. ఆ తర్వాత ఆయన సినిమాను అమ్మేసుకుని డబ్బులు తీసుకుంటాడు. ఇక్కడ సినిమా ఫ్లాప్ అయితే ఒకప్పుడు నిర్మాత నష్టపోతే.., ఇప్పుడు డిస్ర్టిబ్యూటర్లు రో్డ్డుమీద పడుతున్నారు. ఇక్కడే రామ్ గోపాల్ వర్మ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. తన సినిమాల్లో ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదట. వాటాలు ఇచ్చి సినిమాలు చేయించుకుంటున్నాడు. అంటే ప్రతి విభాగానికి ముందే వాటాశాతంను ప్రకటించి.., సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే కలెక్షన్లలో వారికి పంచి ఇస్తున్నాడు.

ఎలాగూ సినిమాను కొనకుండా ఉండరు. కాబట్టి కాస్త ఆలస్యంగా అయినా డబ్బు వస్తుందని నమ్మకంతో అంతా పనిచేస్తున్నారు. ఒకవేళ పొరపాటున హిట్ అయితే ఎక్కువ లాభాలు వస్తాయి. దీంతో వారి వాటాకు కూడా వచ్చే డబ్బు పెరుగుతుంది. ఇలా తెలివితో కేవలం రూ.4లక్షలు ఖర్చుపెట్టి రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసేస్తున్నాడు. అయితే నాలుగు లక్షలు ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. బహుశా ఎడిటింగ్, గ్రాఫిక్స్ విభాగాలకు కావచ్చు. ఎందుకంటే సినిమా విడుదలయ్యాక చూసుకుందాం అని చెప్తే ఎడిటింగ్ కంపనీలు కనీసం రష్ ను చూడకుండా పక్కనబెట్టేస్తాయి.

ఇలా రూ.4లక్షలు పెట్టి సినిమా తీసి.., కనీసంగా రూ.2-3 కోట్ల మద్య వేలం పెట్టి మరి సినిమాను అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బుతో ఎవరికి ఇవ్వాల్సినవి వారికి పంచి ఇస్తున్నారు. అమ్మ దానిమ్మ వర్మా.. ఎమి తెలివి నీది... నువ్వు తలుచుకుంటే.., కెమెరా లేకుండా సినిమా తీయగలవు. స్క్రీన్ లేకుండానే సినిమాను చూపించగలవు. అని విమర్శకులు చమత్కరిస్తున్నారు. ఈ పాలసీనే మిగతావారు కూడా పాటిస్తే.., సగంమంది హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు సినిమాల్లోకి రావాలని అనుకోరు. ఎందుకంటే డబ్బు లేకుండా ఎవరు పనిచేస్తారు చెప్పండి. అదీ సినిమా హిట్ అయితే తీసుకోండి అని మొహం మీద చెప్పేస్తుంటే సినిమా చేస్తారా. వర్మ కాబట్టి చెల్లుతుంది..,సినిమాలు చేస్తున్నారు. ఇదీ వర్మ సీక్వెన్సు సినిమాల సీక్రెట్టు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ice cream2  ram gopal varma  budget  latest news  

Other Articles