Soon goutham menon to make movie with ram charan

ram charan tej, ram charan tej wiki, ram charan tej moveis, ram charan tej latest movies, ram charan tej news, ram charan tej latest updates, ram charan tej upcoming movies, ram charan tej moviw with goutham menon, latest news, movies, tollywood, govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele review, govindudu andarivadele rating, govindudu andarivadele release

in 2015 goutham menon will make a movie with ram charan tej this is announced by charan tej only : ram charan tej interested to do movie with goutham menon in 2015

కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదట

Posted: 09/30/2014 01:00 PM IST
Soon goutham menon to make movie with ram charan

కామెడి కధకు భారీ బడ్జెట్ పెట్టి దెబ్బతిన్న శ్రీనువైట్లతో ఇప్పట్లో సినిమా లేనట్లే అని రామ్ చరణ్ తేజ్ స్పష్టం చేశాడు. ఆయనతో సినిమా చేయాలి అంటే కధ ఓకే కావాలి అంటున్నాడు. ఆగడు’ సినిమా కధ విషయంలోనే దెబ్బయిపోవటంతో వైట్లతో సినిమా అంటే కధ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. అందుకే కథ నచ్చలేదంటూ సినిమాను ప్రస్తుతం పక్కనబెట్టాడు. ఫ్యూచర్ లో మంచి కధ వస్తే చూద్దాంలే అంటున్నాడు. ఈ లోగా తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా చేసేందుకు చెర్రీ ఒకే చెప్పాడట.

హీరోలను స్టయిలిష్ గా చూపించటంతో పాటు., సినిమాలు కూడా వెరైటి కాన్సప్టులతో తీసే గౌతమ్ తో ఓ మూవీ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ఉంటుందని చరణ్ అంటున్నాడు. దీంతో వచ్చే ఏడాదిలో శ్రీను వైట్లతో సినిమా లేదు అని పరోక్షంగా చెప్పినట్లే. ఒకవేళ ఉన్నా అది గౌతమ్ సినిమా తర్వాతే అన్నమాట. తాను చేసే సినిమాల వల్ల అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని.., ఎవరూ డబ్బులు నష్టపోకూడదు అని చెప్పాడు. ప్రస్తుతం ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ విడుదలకు సిద్దంగా ఉండటంతో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తన్నాడు.

ఇక మణిరత్నంతో సినిమా కుదరకపోవటంపై కూడా మాట్లాడాడు. ‘ మణి గారితో సినిమా కధ నచ్చకే ఓకే చెప్పలేదు’ అన్నాడు. గొప్ప దర్శకుడి సినిమాలో నటించాలని ఉన్నా.., కధ నచ్చాలి కదా.., లేకపోతే ఎలా చేసేది? అని అన్నారు. బడ్జెట్, మం చి డైరెక్టర్ కంటే కధకే చెర్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు అంటున్న చరణ్ నిర్ణయం సరైనదే అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  goutham menon  govindudu andarivadele  latest news  

Other Articles