Balakrishna legend movie completing 200days

balakrishna, balakrishna wiki, balakrishna movies, balakrishna upcoming movies, balakrishna legend movie, balakrishna family, balakrishna son, balakrishna daughters, balakrishna house, balakrishna mla, balakrishna latest photos, balakrishna movies list, balakrishna hit movies, nandamuri fans, ntr, balayya, balakrishna funny, balayya funny, legend movie, legend movie free download, latest news, tollywood, movies

star actor balakrishna new movie legend is completing 200days in 2 centers : legend movie team is palnning to arrange a success meet in yemmiganur of kurnool district for lagend movie successfully completing 200days

నందమూరి యువరత్నం.. రికార్డుల లెజెండ్

Posted: 10/02/2014 10:39 AM IST
Balakrishna legend movie completing 200days

నందమూరి బాలకృష్ణ రికార్డులను క్రియేట్ చేయటంలోనే రికార్డు సృష్టించారు. ఎప్పటికప్పుడు అభిమానులకు తగ్గట్టుగా సినిమాలు తీస్తూ.., కొత్త హీరోలకు తానెప్పుడూ పోటినే అని చాటుతున్నారు. ఈ ఏడాదిలో విడుదలైన యువరత్న సినిమా ‘లెజెండ్’ ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా దూసుకుపోతుంది. ఇఫ్పుడు సినిమాలు యాబై రోజులు ఆడటం అంటే గొప్ప.., వంద రోజులు ఆడటం అంటే గగనం. అలాంటిది బాలయ్య ‘లెజెండ్’ ఏకంగా రెండు వందల రోజుల దిశగా దూసుకుపోతుంది.

2సెంటర్లు 200రోజులు

ఈ రికార్డు బాలకృష్ణ పవర్ కు చాలా తక్కువే కాని.., ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వందల రోజులు ఒక సినిమా ఆడటం అంటే చాలా గ్రేట్. ఈ క్రెడిట్, రికార్డు యువరత్నకే దక్కిందని చెప్పాలి. కర్నూలో జిల్లా ఎమ్మిగనూరులో డైరెక్టుగా రెండు వందల రోజులు పూర్తి చేసుకుంటుంటే.., ప్రొద్దుటూరులో సింగిల్ షిప్టుతో రెండు వందల రోజుల సినిమాగా ఆడుతోంది. ఈ సందర్బంగా ఎమ్మిగనూరులో సినిమా విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. పట్టణంలో జరిగే ఈ వేడుకల్లో హీరో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత, టెక్నిషియన్లు తదితరులు హాజరవుతారని తెలుస్తోంది.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి చివరి వారంలో విడుదల అయింది. రాష్ర్టంలో ఉన్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై పలు వివాదాలు ఏర్పడ్డాయి. ఒక ప్రాంతానికి అనుకూలంగా సినిమా ఉందని ఆరోపణలు రాగా.., కొన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కూడా సినిమాలో ప్రచారం చేశారని విమర్శలు వచ్చాయి. ఇలా పలు వివాదాల మద్య విడుదల అయిన ‘లెజెండ్’ సినిమా ఫ్యామిలి ఎంటర్ టైనర్ కావటంతో పాటు సమాజానికి కాస్త మెసేజ్ ఇచ్చే సినిమాగా నిలిచింది. ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో 200రోజుల దిశగా దూసుకుపోతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  legend  tollywood  latest news  

Other Articles